Mamata Banerjee: అక్రమాస్తులున్నట్లు తేలితే బుల్డోజర్లు తీసుకురండి.. అధికారులకు మమత సూచన

తన దగ్గర అక్రమాస్తులు ఉన్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. నిజంగా అక్రమాస్తులు ఉన్నట్లు తేలితే బుల్డోజర్లు తీసుకొచ్చి, వాటిని కూల్చాలని అధికారులకు సూచించారు.

Mamata Banerjee: తన దగ్గర అక్రమాస్తులు ఉన్నట్లు తేలితే, వాటిని కూల్చడానికి బుల్డోజర్లు తీసుకు రావాలని రాష్ట్ర అధికారులకు సూచించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మమతకు సంబంధించి ఆస్తులు భారీగా పెరిగాయని, దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ ఇటీవల కలకత్తా హై కోర్టులో బీజేపీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేసింది.

Hardik Pandya: ధోనీ నుంచి ఎంతో నేర్చుకున్నా.. ఆయన వల్లే ఆటగాడిగా ఎదిగా: హార్ధిక్ పాండ్యా

ప్రతిపక్షాలన్నీ ఈ విషయంలో మమతపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో మమత ఈ అంశంపై స్పందించారు. కోల్‌కతాలోని సెక్రటేరియట్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘నేను ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్నానని అంటున్నారు. ఈ అంశంపై మా చీఫ్ సెక్రెటరీకి చెబుతున్నా.. విచారణలో నేను ఏ భూమినైనా ఆక్రమించుకున్నట్లు తేలితే.. ఆ ఆస్తులపైకి బుల్డోజర్లు తీసుకురండి. సామాజిక సేవ నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. ఒకవేళ అప్పట్లోనే ఈ తరహా రాజకీయాల్ని చూసుంటే.. అప్పుడే దూరంగా ఉండేదాన్ని. బొగ్గు నుంచి వచ్చిన డబ్బంతా కాలిఘాట్‌కు వెళ్తుంది అంటున్నారు. కాళిఘాట్ ఎక్కడుందో చెప్పండి? ఒక్కరే.. అన్నిసార్లు, అందరినీ మోసం చేయలేరు’’ అంటూ మమత వ్యాఖ్యానించింది.

Jersey: ఇండియా-పాక్ మ్యాచ్.. పాకిస్తాన్ జెర్సీ ధరించిన భారతీయుడు… ప్రాంక్ కోసమట!

తాజాగా మమత మేనల్లుడికి ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. బొగ్గు కుంభకోణానికి సంబంధించి వచ్చే శుక్రవారం దీనిపై విచారణ జరగనుంది.

 

ట్రెండింగ్ వార్తలు