Hardik Pandya: ధోనీ నుంచి ఎంతో నేర్చుకున్నా.. ఆయన వల్లే ఆటగాడిగా ఎదిగా: హార్ధిక్ పాండ్యా

భారత మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ నుంచి ఆటగాడిగా తానెంతో నేర్చుకున్నానని చెప్పాడు స్టార్ ప్లేయర్ హార్ధిక్ పాండ్యా. అయితే, ఓటముల నుంచి కూడా మరిన్ని పాఠాలు నేర్చుకున్నట్లు వివరించాడు.

Hardik Pandya: ధోనీ నుంచి ఎంతో నేర్చుకున్నా.. ఆయన వల్లే ఆటగాడిగా ఎదిగా: హార్ధిక్ పాండ్యా

Hardik Pandya: భారత మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఆయన వల్లే ఒక క్రికెటర్‌గా ఎదిగానని చెప్పాడు భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో హార్ధిక్ అదరగొట్టిన సంగతి తెలిసిందే.

Jersey: ఇండియా-పాక్ మ్యాచ్.. పాకిస్తాన్ జెర్సీ ధరించిన భారతీయుడు… ప్రాంక్ కోసమట!

బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ధోని నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు వెల్లడించాడు. ‘‘నేనప్పుడే జట్టులోకి అడుగుపెట్టి ఆటగాడిగా కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. ఆ సమయంలో ధోని నా కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు. నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఆయనను పరిశీలిస్తూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడిని. ఆయన ఆలోచనలు, తెలివిని పరిశీలిస్తే చాలు.. అవి మైదానంలో నాకెంతగానో ఉపయోగపడేవి. అలాగే.. ఎవరైనా తమ ఓటములు, పొరపాట్ల నుంచే పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనకు దగ్గరగా ఉండే వ్యక్తులు, కావాల్సిన వాళ్లు, చివరకు ధోనీ లాంటి వాళ్లకన్నా కూడా ఓటములే పాఠాలు నేర్పుతాయి’’ అని పాండ్యా వ్యాఖ్యానించాడు.

India: దేశంలో మరింత పెరగనున్న ఎండలు.. తాజా సర్వేలో వెల్లడి

ఇక మ్యాచ్‌ను అద్భుతంగా ముగించడంపై కూడా ఆయన స్పందించాడు. ‘‘ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఎంత మంచి ఫుడ్ అయినా సరే.. దానికి ఫినిషింగ్ టచ్ ఇవ్వకపోతే అంత అద్భుతంగా అనిపించదు. దాని రుచి ఎంత బాగున్నా సరే.. లుక్ కూడా ఆకట్టుకోవాలి. అలాగే మ్యాచులో కూడా ఎంత బాగా ఆడినా ఫినిషింగ్ టచ్ లేకపోతే అది అసంపూర్తిగా అనిపిస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.