India: దేశంలో మరింత పెరగనున్న ఎండలు.. తాజా సర్వేలో వెల్లడి

దేశంలో రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఎండలు భారీ స్థాయిలో పెరగబోతున్నట్లు తాజా సర్వే ఒకటి తేల్చింది. ఇండియాలాంటి అనేక ఉష్ణ మండల దేశాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని ఆ సర్వే చెప్పింది.

India: దేశంలో మరింత పెరగనున్న ఎండలు.. తాజా సర్వేలో వెల్లడి

India: డాకాలం వచ్చిందంటే చాలు.. దేశంలో ప్రతి సంవత్సరం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగతా సీజన్లలోనూ ఎండలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఇప్పటి వరకు నమోదవుతున్న ఎండలే దేశ ప్రజల్ని బెంబేలెత్తిస్తుంటే, రాబోయే కాలంలో మరింతగా ఎండలు భయపెట్టడం ఖాయమంటున్నారు నిపుణులు.

Viral Video: ఇంత నిర్లక్ష్యమా.. అమెజాన్ పార్శిళ్లు విసిరేస్తున్న సిబ్బంది.. వీడియో వైరల్

ఎందుకంటే రాబోయే కాలంలో దేశంలో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరగబోతున్నాయట. ఇండియాలాంటి ఉష్ణ మండల దేశాల్లో రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఎండలు గణనీయంగా పెరగబోతున్నట్లు తాజా సర్వే ఒకటి తేల్చింది. జర్నల్ కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ నివేదిక ప్రకారం.. వాతావరణ మార్పులు, కర్బన ఉద్గారాల కారణంగా ఎండలు గణనీయంగా పెరుగుతాయి. ఏడాదిలో అనేక రోజులు 25-50 శాతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 2050 వరకు ఉష్ణ మండల దేశాల్లో భారీ ఎండలు నమోదవుతాయి. ఆసియాతోపాటు, ఉత్తర యూరప్‌లో ప్రమాదకరమైన వడగాడ్పులు కూడా వచ్చే అవకాశం ఉంది.

Muslims and Hindus: వెల్లివిరిసిన మత సామరస్యం.. వినాయక చవితి వేడుకల్లో ముస్లింలు

కర్బన ఉద్గారాల్ని తగ్గించకపోతే ఇదే రీతిలో ఎండలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇది ఎంతోమంది ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఎండ వేడిమిని తట్టుకోలేని వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వ్యవసాయ రంగానికి కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.