Muslims and Hindus: వెల్లివిరిసిన మత సామరస్యం.. వినాయక చవితి వేడుకల్లో ముస్లింలు

కర్ణాటకలో ఒక పక్క అనేక అంశాల్లో హిందూ-ముస్లింల మధ్య వివాదాలు నడుస్తుంటే.. మరోపక్క వినాయక చవితి సందర్భంగా మత సామరస్యం వెల్లివిరిసింది. వినాయక చవితి వేడుకల్లో ముస్లింలు పాల్గొన్నారు.

Muslims and Hindus: వెల్లివిరిసిన మత సామరస్యం.. వినాయక చవితి వేడుకల్లో ముస్లింలు

Muslims and Hindus: హిందువులు ఘనంగా జరుపుకొనే వినాయక చవితి వేడుకల్లో ముస్లింలు కూడా భాగమవుతున్నారు. ఒక పక్క కర్ణాటకలో హిజాబ్, గోవధ నిషేధం లాంటి అంశాలు ఉద్రిక్త పరిస్థితులు రేకెత్తిస్తుంటే, మరోపక్క హిందూ-ముస్లింలు వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటున్నారు.

Jersey: ఇండియా-పాక్ మ్యాచ్.. పాకిస్తాన్ జెర్సీ ధరించిన భారతీయుడు… ప్రాంక్ కోసమట!

కర్ణాటకలోని మాండ్యాలో బుధవారం జరిగిన వినాయక చవితి వేడుకల్లో ముస్లింలు పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది ఈ ఘటన. మాండ్య జిల్లా, హుబ్బాలి, చామ్రాజ్‌పేట్‍‌కు చెందిన హిందూ, ముస్లింలు వినాయక చవితి సందర్భంగా జరిగిన తొలి పూజలో కలిసి పాల్గొన్నారు. ఇక్కడి బీడీ కాలనీలో ఈ పూజ జరిగింది. ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకల్లో ముస్లింలు కూడా ఉత్సాహంగా పాల్గొనడం ఆసక్తి కలిగించింది. మరోపక్క హుబ్బాలిలోనే జరిగిన వినాయక చవితి వేడుకల్లో శ్రీ రామ్ సేన చీఫ్ ప్రమోదో ముతాలిక్, అతడి అనుచరులు ప్రవర్తించిన తీరు ఉద్రిక్తతకు దారి తీసింది.

CM KCR: ఎనిమిదేళ్లలో ఒక్క రంగాన్నైనా బాగు చేశారా? కేంద్రాన్ని ప్రశ్నించిన సీఎం కేసీఆర్

ఈద్గా ప్రాంతంలో సావర్కర్, బాల గంగాధర్ తిలక్ చిత్ర పటాలను పట్టుకుని ఊరేగించారు. కోర్టు ఇక్కడ వినాయక చవితి వేడుకలకు అనుమతించింది. కానీ, ఎలాంటి ఉద్రిక్తతలు రెచ్చగొట్టే పోస్టర్లు వంటివి ప్రదర్శించకూడదని ఆదేశించింది.