CM KCR: ఎనిమిదేళ్లలో ఒక్క రంగాన్నైనా బాగు చేశారా? కేంద్రాన్ని ప్రశ్నించిన సీఎం కేసీఆర్

మోదీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదన్నారు సీఎం కేసీఆర్. మోదీ పాలనలో అన్ని రంగాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీని సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. బిహార్‌లోని పాట్నాలో సీఎం నితీష్ కుమార్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ పాల్గొన్నారు.

CM KCR: ఎనిమిదేళ్లలో ఒక్క రంగాన్నైనా బాగు చేశారా? కేంద్రాన్ని ప్రశ్నించిన సీఎం కేసీఆర్

Telangana Cabinet

CM KCR: మోదీ అధికారం చేపట్టిన ఎనిమిదేళ్లలో దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు తెలంగాణ సీఎం కేసీఆర్. బిహార్‌లోని పాట్నాలో సీఎం నితీష్ కుమార్‌తో కేసీఆర్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. కనీసం ఒక్క రంగాన్నైనా బాగు చేశారా? బీజేపీ సర్కారును సాగనంపాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పతనమైంది.

Viral Video: ఇంత నిర్లక్ష్యమా.. అమెజాన్ పార్శిళ్లు విసిరేస్తున్న సిబ్బంది.. వీడియో వైరల్

ఏ ప్రధాని హయాంలో కూడా రూపాయి విలువ ఇంతగా పడిపోలేదు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. న్యాయం కోసం రైతులు ఐదు నెలలు ఆందోళన చేయాలా? ఖర్చులు పెరిగిపోయాయి. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు… కానీ, ఖర్చులు డబుల్ అయ్యాయి. దేశంలో పరిస్థితులు ఘోరంగా మారుతున్నాయి. సామాన్యులు, రైతులు అంతా ఆందోళనలో ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో తాగునీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలోనే నాణ్యమైన విద్యుత్ సరఫరా లేదు. కేంద్ర అసమర్ధత వల్ల దేశం అనేక రకాలుగా నష్టపోతోంది. స్వయం సమృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోంది. ఎఫ్ఆర్‌బీఎమ్ వంటి ఆంక్షలతో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి.

Jersey: ఇండియా-పాక్ మ్యాచ్.. పాకిస్తాన్ జెర్సీ ధరించిన భారతీయుడు… ప్రాంక్ కోసమట!

దేశంలోని నదుల్లో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. దేన్నీ సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. మతాలు, గ్రూపుల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. విదేశాలకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వస్తోంది. ధర్మం పేరిట చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఏ వర్గానికి మేలు కలిగింది? అంతా వినాశనమే. మేకిన్ ఇండియాతో సాధించింది ఏంటి? గాలి పటాలకు వాడే దారం కూడా చైనా నుంచే దిగుమతి అవుతోంది. కరోనా సమయంలో కార్మికులను కేంద్రం ఇబ్బంది పెట్టింది. కరోనా సమయంలో కార్మికుల కోసం 150 రైళ్లు ఏర్పాటు చేశాం. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ సర్కారును దింపాల్సిందే. బీజేపీ ముక్త భారత్ కావాలి. అన్ని పక్షాలను కలుపుకొని వెళ్తాం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలను పక్కనబెట్టాలి.

Cabinet approves: రాష్ట్రాలకు రాయితీతో పప్పు ధాన్యాలు.. కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం

అన్ని పక్షాలు కలిపి బీజేపీ ముక్త భారత్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి. నితీష్ కూడా బీజేపీ ముక్త భారత్ కోరుకుంటున్నారు. మంచి దేశాన్ని నాశనం చేస్తున్నారు. మేకిన్ ఇండియా ఫలితం ఏమైంది? భేటీ బచావో అంటున్నారు.. కానీ, అత్యాచారాలు పెరిగిపోయాయి. బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఏకతాటిపై ఉన్నాం. ఈ దేశంలో మిగిలింది వ్యవసాయ భూములు మాత్రమే.. వాటిని కూడా వాళ్ల మిత్రలకు అమ్మేస్తారు. అంతర్జాతీయ వేదికలపై దేశం పరువు తీస్తున్నారు. శ్రీలంక యువత మోదీపై ఆగ్రహంగా ఉంది’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.