Cabinet approves: రాష్ట్రాలకు రాయితీతో పప్పు ధాన్యాలు.. కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం

రాష్ట్రాలకు రాయితీ ధరకే పప్పు ధాన్యాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. 15 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాల్ని తక్కువ ధరకే అందించేందుక ఆర్థిక శాఖ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Cabinet approves: రాష్ట్రాలకు రాయితీతో పప్పు ధాన్యాలు.. కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం

Cabinet approves: రాష్ట్రాలతోపాటు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రాయితీ ధరతో పప్పు ధాన్యాలు అందించనున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.

Viral Video: ఇంత నిర్లక్ష్యమా.. అమెజాన్ పార్శిళ్లు విసిరేస్తున్న సిబ్బంది.. వీడియో వైరల్

మద్దతు ధర, ధరల స్థిరీకరణ నిధి కింద ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నారు. ఇది ఒక్క సంవత్సరం మాత్రమే సాగే పథకం. పన్నెండు నెలలు లేదా స్టాక్ ముగిసే వరకు మాత్రమే రాయితీ ధరతో పప్పు ధాన్యాలు అందిస్తారు. అలాగే 25-40 శాతం వరకు పప్పు ధాన్యాల్ని అధికంగా కొనాలని కూడా కేంద్రం నిర్ణయించింది. దీని కోసం రూ.1,200 కోట్లను కేంద్రం కేటాయించనుంది. ఈ నిర్ణయం ప్రకారం 15 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాన్ని కేంద్రం రాష్ట్రాలకు తక్కువ ధరకే అందిస్తుంది. శనగల్ని కిలో రూ.8కే అందించనుంది. అలాగే పెసర పప్పు, కంది పప్పు వంటివి కూడా రాయితీ ధరకే అందిస్తుంది.

Jersey: ఇండియా-పాక్ మ్యాచ్.. పాకిస్తాన్ జెర్సీ ధరించిన భారతీయుడు… ప్రాంక్ కోసమట!

అయితే, ఎవరు ముందుగా ధర చెల్లించి కొనుగోలు చేస్తే వారికే వీటిని అందిస్తారు. డబ్బులు చెల్లించి కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాల్లో ఏ రాష్ట్రానికి ఎంత అవసరమైతే అంత అందిస్తారు. ఈ ధాన్యాన్ని వ్యాపారం కోసం కాకుండా, సంక్షేమ పథకాల కోసమే వాడాల్సి ఉంటుంది. అంటే మధ్యాహ్న భోజన పథకం, శిశు అభివృద్ధి, పోషకాహారం, పౌర సరఫరాలు వంటి పథకాల్లో మాత్రమే వినియోగించాలి. ఈ నిర్ణయం వల్ల రైతులకు కూడా మేలు జరుగుతుందని కేంద్రం భావిస్తోంది.