Bike Stunt : పోతావ్ రా రేయ్..! ప్రియురాలిని అలా కూర్చోబెట్టుకుని బైక్ రైడింగ్
ఓ వ్యక్తి తన ప్రియురాలిని బైక్ పెట్రోల్ ట్యాంక్ పై తనకు ఎదురుగా కూర్చోబెట్టుకుని హైవేపై ప్రమాదకరంగా బైక్ రైడింగ్ చేశాడు. దీన్ని మరో బైకర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.(Bike Stunt)

Bike Stunt : సినిమాల ప్రభావమో.. పాపులారిటీ కోసమో, వైరల్ అవ్వడం కోసమో.. తెలియదు కానీ, కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. చేతులారా తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు. ఇతరుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణలు పొగొట్టుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ వ్యక్తి చేసిన పని తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఓ వ్యక్తి తన ప్రియురాలిని బైక్ పెట్రోల్ ట్యాంక్ పై తనకు ఎదురుగా కూర్చోబెట్టుకుని హైవేపై ప్రమాదకరంగా బైక్ రైడింగ్ చేశాడు. దీన్ని మరో బైకర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హృతిక్-కత్రిన నటించిన బ్యాంగ్ బ్యాంగ్ మూవీలో ఓ సీన్ లో హీరో-హీరోయిన్ ఇలా బైక్ పై వెళ్తారు. అదే తరహాలో ఈ వ్యక్తి కూడా ఫీట్ చేసినట్లు ఉన్నాడు.
అసలే అది హైవే. పెద్ద పెద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో తిరుగుతూ ఉంటాయి. అది కూడా వేగంగా వెళ్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చాలా కేర్ ఫుల్ బైక్ రైడింగ్ చేయాలి. కానీ ఆ వ్యక్తి మాత్రం అస్సలు బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. లవర్ ని పెట్రోల్ ట్యాంక్ పై తనకు ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. ఆమె అలా కూర్చోవడం వల్ల తనకు ఎదురుగా ఏం వస్తున్నాయో అతడికి కనిపించడం కష్టంగా మారుతుంది. ఏ మాత్రం తేడా జరిగినా ఘోర ప్రమాదం జరిగే చాన్స్ ఉంది. అయితే ఈ విషయాలేవీ పట్టించుకోకుండా అతడు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(Bike Stunt)
థానే-బీవాండీ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఆ మహిళ బుర్కా ధరించి ఉంది. మరో బైకర్ తమను వీడియో తీస్తున్నట్లు గుర్తించిన ఆ వ్యక్తి బండిని రోడ్డు పక్కకి ఆపాడు. వీడియో తీస్తున్న వ్యక్తితో గొడవకు దిగాడు. ఎందుకు వీడియో తీస్తున్నావని అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కావాలంటే నా బండి నెంబర్ ప్లేట్ కూడా వీడియో తీసుకో అని అతడితో అన్నాడు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పుణె పోలీసులు స్పందించారు. ఆ బైకర్ తీరుపై సీరియస్ అయ్యారు. అతడిపై చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డుపై పిచ్చి పని చేసిన ఆ వ్యక్తిని జుబైర్ షబ్బీర్ గా పోలీసులు గుర్తించారు. నెటిజన్లు సైతం ఆ వ్యక్తిపై మండిపడుతున్నారు. ప్రమాదకర స్టంట్ చేసిన ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
Video of bike rider goes viral..As at busy Thane bhiwandi highway. he is riding bike sitting a girl on bike tank ..@ThaneCityPolice @MumbaiPolice @MumbaiRTO pic.twitter.com/oRL2Fe7WH6
— EXPRESS NEWS HINDI (@expressnews4u) December 22, 2022