చంద్రబాబుకు కేంద్రమంత్రి లేఖ

  • Published By: vamsi ,Published On : February 16, 2020 / 01:20 AM IST
చంద్రబాబుకు కేంద్రమంత్రి లేఖ

Updated On : February 16, 2020 / 1:20 AM IST

తెలుగుదేశం నాయకులు, ఏపీ ప్రతిపక్ష నేతకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ లేఖ రాశారు. కరోనా వైరస్ చైనాలో విపరీతంగా ఉండగా.. అక్కడి వూహన్ సిటీలో చిక్కుకున్న ఇంజనీర్లను ఇక్కడకు తీసుకుని రావాలంటూ జనవరి 30వ తేదీన లేఖ రాశారు. ఆ లేఖకు స్పందనగా..  చంద్రబాబుకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రత్యుత్తరం రాశారు. మొత్తం 58 మంది ఇంజినీర్లలో 56 మందిని వూహాన్ నుంచి ఎయిరిండియా విమానంలో ఫిబ్రవరి 1న తరలించినట్లు వెల్లడించారు.

ఈ 56 మందికి ప్రస్తుతం ప్రత్యేక వైద్య పరిక్షలు చేసి పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. మరో ఇద్దరు ఇంజనీర్లు అన్నెం జ్యోతి, దొంతంశెట్టి సత్య సాయికృష్ణ మాత్రం సాధారణం కన్నా శరీర ఉష్ణోగ్రతలు కొద్దిగా అధికంగా ఉండటంతో ఫిబ్రవరి 1న విమానంలో పంపేందుకు చైనా అధికారులు అనుమతించలేదని చెప్పారు. ఆ ఇద్దరు చైనాలోని వుహాన్ హైటెక్ డెవలప్ మెంట్ జోన్, ఆప్టిక్స్ వ్యాలీ ఇండస్ట్రియల్ పార్క్ లో స్టార్ట్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజి కంపెనీ లిమిటెడ్ లోనే ప్రస్తుతం ఉన్నట్లు జైశంకర్ తెలిపారు.

బీజింగ్‌లోని భారత ఎంబసీ అధికారులు వారిద్దరితో, వారి కుటుంబాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు చెప్పారు. వీరిద్దరికి కావాల్సిన వైద్య చికిత్స, ఇతర అవసరాలలో అండగా ఉండాలని, వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, వారి క్షేమ సమాచారాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని వుహాన్‌లోని వైద్యాధికారులను భారత ఎంబసీ అధికారులు చెప్పినట్లు లేఖలో తెలిపారు. అంతకుముందు అన్నెం జ్యోతి తల్లిదండ్రులు చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. 

Read More>> విష్ణు మై వాలెంటైన్ – రిలేషన్ కన్ఫర్మ్ చేసిన జ్వాల గుత్తా