Priyanka Gandhi: రాహుల్ గాంధీ కోసం ప్రాణాలైనా త్యాగం చేస్తా – ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. 'నా సోదరుడు కోసం ప్రాణ త్యాగానికైనా రెడీగా ఉన్నా.

Rahul Priyanka
Priyanka Gandhi: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. ‘నా సోదరుడు కోసం ప్రాణ త్యాగానికైనా రెడీగా ఉన్నా. రాహుల్ కూడా అంతే. బీజేపీలో ఉంటాయి కానీ, కాంగ్రెస్ లో అలాంటి విబేధాలు ఉండవు’ అని అంటున్నారు.
ఇటీవలే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాలు ఉన్నాయని అన్నారు. ‘ఆ విబేధాలు అనేవి యోగి ఆలోచనల్లో ఉన్నాయి. దానిని బట్టే తెలుస్తుంది బీజేపీలోనే అలాంటివి ఉన్నాయని. అమిత్ షాకు మోడీకి మధ్య అలా జరిగి ఉండొచ్చు’ అని ప్రియాంక తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవీ సోచ్, నవా పంజాబ్ అనే అంశంపై పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 20న 117 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న కౌంటింగ్ ప్రక్రియ ముగియనుంది.
ఉత్తరప్రదేశ్‌కు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రియాంక గాంధీ.. అధికార బీజేపీని, అఖిలేశ్ యాదవ్ అధ్యక్షతన నడుస్తున్న సమాజ్‌వాదీ పార్టీని ధీటుగా ప్రచారం చేస్తున్నారు.
Read Also: ఐపీఎల్‌తో పాటు శివమ్ దూబెకు మరో గుడ్ న్యూస్