నన్ను గెలిపిస్తే కోటి రూపాయలు ఇస్తా, చంద్రుడిపైకి తీసుకెళ్తా.. నాకు ఓటేస్తే మోకాలి ఆపరేషన్ ఫ్రీ.. కళ్లు బైర్లు కమ్మే హామీలు
తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచించాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. కాగా, కొందరు అభ్యర్థులు.. చిత్ర విచిత్రమైన హామీలతో హాట్ టాపిక్ గా మారారు. వారు ప్రకటించిన హామీలు వింటే ఫ్యూజులు ఎగరాల్సిందే.

Candidate Promising Helicopters, Trip To Moon
Candidate Promising Helicopters, Trip To Moon : తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచించాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. కాగా, కొందరు అభ్యర్థులు.. చిత్ర విచిత్రమైన హామీలతో హాట్ టాపిక్ గా మారారు. వారు ప్రకటించిన హామీలు వింటే ఫ్యూజులు ఎగరాల్సిందే.
దక్షిణ మధురై నుంచి పోటీ చేస్తున్న శరవణన్ అనే స్వతంత్ర అభ్యర్థి రిలీజ్ చేసిన మేనిఫెస్టో చర్చనీయాంశంగా మారింది. అందులో అతడు ఇచ్చిన హామీలు కళ్లు బైర్లు కమ్మించేలా ఉన్నాయి. తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి ఓ ఐఫోన్, కారు, హెలికాప్టర్, రోబో ఇస్తానని ప్రామిస్ చేశాడు. అంతేకాదు స్విమ్మింగ్ పూల్ ఉన్న మూడంతస్తుల ఇంటిని, యువతకు కోటి రూపాయలతో పాటు వంద రోజుల పాటు చంద్రుడి మీదకు టూర్ తీసుకెళ్తానంటూ హామీ ఇచ్చాడు. మధురైలో స్పేస్ రీసర్చ్ సెంటర్, రాకెట్ లాంచ్ సైట్, ఆర్టిఫీషియల్ ఐస్‌బర్గ్‌ను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశాడు.
ఎన్నికల వేళ పార్టీలు, నేతలు హామీలు ఇచ్చి ఆ తర్వాత మరిచిపోతుంటారని, ఓటర్లు ఆ విషయాన్ని గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో ఇలాంటి హామీలు ఇచ్చినట్లు శరవణన్ తెలిపాడు. సంక్షేమ పథకాలు ప్రకటించే పార్టీలు.. ఆ తర్వాత వాటిని అమలు చేయవని, దానిపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి హామీలతో మ్యానిఫెస్టో రిలీజ్ చేసినట్లు వివరించాడు.
ఇక మొదకురిచి నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ సరస్వతి వినూత్న హామీలిచ్చారు. నియోజకవర్గంలో ప్రజలు ఎక్కువగా మోకాలి నొప్పులతో బాధపడుతున్నట్లు తనకు తెలిసిందని, తనను గెలిపిస్తే ఉచితంగా మోకాలి చికిత్స ఆపరేషన్ చేయిస్తానని ఆమె అన్నారు. అంతేకాదు జల్లికట్టు కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారు. తమిళ మార్షల్ ఆర్ట్స్ సిలంబమ్ కు జాతీయ గుర్తింపు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.