Sonali Guha Trinamool: దీదీ లేకుండా ఉండలేమంటూ బీజేపీ నుంచి తృణమూల్‌కు..
టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సోనాలీ గుహ ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్లి ఆ పార్టీలో ఉండలేనంటూ.. తృణమూల్ కు వచ్చేస్తానని వేడుకుంటుంది. ఈ మేరకు పార్టీ వీడి వచ్చానని

Sonali Guha Tmc
Sonali Guha Trinamool: టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సోనాలీ గుహ ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్లి ఆ పార్టీలో ఉండలేనంటూ.. తృణమూల్ కు వచ్చేస్తానని వేడుకుంటుంది. పార్టీ వీడి వచ్చానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి క్షమాపణ పత్రం రాశారు. అంతేకాకుండా తిరిగి తనను పార్టీలోకి తీసుకోవాలంటూ రిక్వెస్ట్ చేశారు.
ఈ లెటర్ ను తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ఎమోషనల్ అయ్యానని చెప్పారు. ‘ఈ లెటర్ ను ముక్కలైన హృదయంతో రాస్తున్నా. వేరే పార్టీలో జాయిన్ అయి తప్పుడు నిర్ణయమే తీసుకున్నా. అక్కడ ఉండలేకపోతున్నా’
‘నీరు దాటిన చేప ఎలా ఉండలేదో.. అలాగే మీరు లేకుండా నేను ఉండలేను దీదీ. నీ క్షమాపణ కోరుతున్నాయి. వీలైతే నన్ను మన్నించండి. నేను బతకలేకపోతున్నా. తిరిగి రానివ్వండి మీ ఎఫెక్షన్ తో నా మిగిలిన జీవితం గడపనివ్వండి’ అని బెంగాలీలో రాశారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుహను.. మమతా బెనర్జీ నీడగా అభివర్ణించేవాళ్లు. బీజేపీలోకి ఇతర నేతలు జాయిన్ అవుతున్నా.. టీఎంసీలోనే ఉన్నారు గుహ. ఈ సారి టీఎంసీ అభ్యర్థుల జాబితాలో పేరు ఉంచకపోవడంతో టీవీ ఛానెల్ ముందే ఎమోషనల్ అయి బీజేపీలో చేరిపోయింది.
‘బీజేపీలో జాయిన్ అవ్వాలనుకున్న నా నిర్ణయం తప్పు. అది ఆ రోజు తీసుకుంది మాత్రమే. బీజేపీ పార్టీ వదిలేస్తున్నానని చెప్పడానికి బాధపడటం లేదు. అక్కడ నా అవసరం లేదనే అనుకుంటున్నా’ అని చెప్పారు.