అత్యవసర మందుల ధరలు పెరగబోతున్నాయ్!

దేశవ్యాప్తంగా మెడిసిన్ ధరలను పెంచుకునేందుకు కొంతకాలంగా ట్రై చేస్తున్న ఫార్మా కంపెనీలకు మందులపై 50శాతం వరకు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఇలాంటి పెంపుదలకు అనుమతించాలని ఔషధ తయారీదారులు చాలాకాలం నుంచి లాభియింగ్ చేయగా.. ఎట్టకేలకు వాళ్ల నిర్ణయానికి పచ్చజెండా ఊపింది జాతీయ ఔషధాల స్థాయీ సంఘం (ఎస్‌ఎన్‌సీఎం).
మొత్తం 21రకాల మందులపై గరిష్ట రిటైల్ ధరను 50 శాతం వరకు పెంచుకునేందుకు భారత ఔషద ధరల నియంత్రక సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
డిసెంబర్ 9 న ఎన్‌పిపిఎ అధికారుల సమావేశం తరువాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. క్షయ, విటమిన్ సి, మెట్రోనిడాజోల్ మరియు బెంజైల్పెనిసిలిన్ వంటి యాంటీబయాటిక్స్, యాంటీ మలేరియా డ్రగ్ క్లోరోక్విన్ మరియు కుష్టు మందుల డాప్సోన్ వంటి బిసిజి వ్యాక్సిన్ వంటి రోగాలకు సంబంధించి ఉపయోగించే మెడిసిన్‌కు ఇది వర్తిస్తుంది.
డిపిసిఓ (డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్) 2013 ప్రకారం ధరల నియంత్రణలో మార్పులు చేసింది. మొత్తం 21 తక్కువ ధర కలిగిన మందులుపై ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. ఈ మందులలో ఎక్కువ భాగం చికిత్స ఫస్ట్ స్టేజ్‌లో ఉపయోగించబడతాయి. తద్వారా నకిలీ మందులు తగ్గే అవకాశం ఉందని కూడా అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.