TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్

పశ్చిమ బెంగాల్ లో ఓ నటుడు తృణముల్ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అతను బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ నటుడు ఘాజీ అబ్దుల్ నూర్. ఈ క్రమంలో భారతదేశాన్ని విడిచి వెళ్లిపొమ్మంటు ఘాజీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఘాజీ అబ్దుల్ నూర్ అనే నటుడు, తన వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండటంతో పాటు.. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని పశ్చిమ బెంగాల్ బీజేపీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది.
Also Read : మురళీ మోహన్ కోడలుకు యాక్సిడెంట్: అపోలోలో చికిత్స
వీసా నిబంధనలను అతిక్రమించినందుకు దేశం విడిచి వెళ్లాలని నూర్‌కు కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ కు చెందిన మరోనటుడు ఫెర్డోస్ అహ్మద్‌కు కూడా కేంద్రం మంగళవారం (ఏప్రిల్ 16)న ఆదేశాలు జారీచేసింది. బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో తృణమూల్ తరపున అహ్మద్ ప్రచారం చేశాడు. దీంతో అతడికి ఇచ్చిన బిజినెస్ వీసాను కూడా కేంద్రం రద్దు చేయటం గమనించాల్సిన విషయం.
Also Read : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా?