Jyotiraditya Scindia- Minister Wear ‘chappal’ : 2నెలల తరువాత చెప్పులు ధరించిన రాష్ట్ర మంత్రి..స్వయంగా చెప్పులు అందించిన కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా

2నెలల తరువాత చెప్పులు ధరించిన రాష్ట్ర మంత్రికి..స్వయంగా చెప్పులు అందించారు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా.

Jyotiraditya Scindia- Minister Wear ‘chappal’ : 2నెలల తరువాత చెప్పులు ధరించిన రాష్ట్ర మంత్రి..స్వయంగా చెప్పులు అందించిన కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా

Jyotiraditya Scindia-MP Minister Wear 'chappal' (1)

Updated On : December 27, 2022 / 11:34 AM IST

Central minister Jyotiraditya Scindia helps Mp minister wear ‘chappal’ : పెద్దస్థాయిలో ఉన్న రాజకీయ నేతలకు ఎవరన్నా చెప్పులు అందిస్తే అది ఎంత వివాదం అవుతోంది గతంలో పలు ఘటనలు చూశాం. కానీ ఓ రాష్ట్ర మంత్రికి ఓ కేంద్రమంత్రి స్వయంగా చెప్పులు అందించారు. ‘సార్ మీరు కోరుకున్న పనులు జరుగుతున్నాయి కదా ఇప్పటికైనా చెప్పులు ధరించండీ సార్ అంటూ మధ్యప్రదేశ్ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ కు ఎంతో గౌరవంగా చెప్పులు అందించారు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా. మంత్రి ప్రద్యుమన్ సింగ్ కు జ్యోతిరాదిత్య సింధియా చెప్పులు అందించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తననంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమన్‌ సింగ్‌ తోమర్‌ తన నియోజక వర్గం అయిన గ్వాలియర్ లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయిని వాటికి మరమత్తులు చేయించమని ఆ పనులు చేపట్టే వరకు చెప్పులు ధరించను అని ప్రతిజ్ఞ చేశారు. అప్పటినుంచి ఆయన చెప్పులు ధరించకుండా ఒట్టి కాళ్లతోనే తిరుగుతున్నారు. అలా 56 రోజులుగా మంత్రి ప్రద్యుమన్ సింగ్ చెప్పులు ధరించకుండా ఉన్నారు. అక్టోబరు 30 నుంచి చెప్పులు వేసుకోకుండానే తిరుగుతున్నారు.

ఈ క్రమంలో ఇటీవలే గ్వాలియర్ నియోజకవర్గంలో రోడ్లు మరమత్తుల పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆదివారం (డిసెంబర్ 25,2022) ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంత్రి ప్రద్యుమన్ సింగ్ ను చెప్పులు ధరించటానికి ఒప్పించారు. సారు మీరు అనుకున్న పనులు జరుగుతున్నాయి ఇప్పటికైనా చెప్పులు ధరించండీ అంటూ ఒప్పించారు.

అంతేకాదు సింధియానే స్వయంగా మంత్రి ప్రద్యుమన్ సింగ్ కు కొత్త చెప్పులు అందించారు. దీంతో మధ్యప్రదేశ్ మంత్రి ప్రద్యుమన్ సింగ్ చెప్పులు ధరించారు. అనంతరం మధ్యప్రదేశ్ మంత్రి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య పాదాలకు సింగ్‌ నమస్కరించారు. రోడ్లను బాగు చేసినందుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్‌లకు మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ ధన్యవాదాలు తెలిపారు.