Smart Cities Awards: దేశంలో స్మార్ట్ సిటీ అవార్డ్స్-2020 లిస్ట్ విడుదల చేసిన కేంద్రం
మోడీ ప్రభుత్వం ఎర్పాటయ్యాక చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటి స్మార్ట్ సిటీ మిషన్. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఇండియా స్మార్ట్ సిటీ పోటీ-2020 ఫలితాలను శుక్రవారం ప్రకటించింది కేంద్రం.

Centre Releases Full List Of Smart Cities Awards 2020 Winners
Smart Cities Awards 2020 winners: మోడీ ప్రభుత్వం ఎర్పాటయ్యాక చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటి స్మార్ట్ సిటీ మిషన్. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఇండియా స్మార్ట్ సిటీ పోటీ-2020 ఫలితాలను శుక్రవారం ప్రకటించింది కేంద్రం. వర్చువల్ కార్యక్రమంలో ఉత్తమ నగరాలకు కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి అవార్డులు ఇచ్చారు. 100 స్మార్ట్ సిటీలలో మొత్తం పనితీరు పరంగా, సూరత్ మరియు ఇండోర్ మొదటి స్థానంలో నిలిచాయి.
2019లో స్మార్ట్ సిటీస్‌లో ఒంటరిగా సూరత్ విజేతగా నిలవగా.. ఈసారి అవార్డును ఇండోర్‌తో కలిసి పంచుకుంది. 2020కి గాను ఇండోర్ (మధ్యప్రదేశ్) మరియు సూరత్ (గుజరాత్) సంయుక్తంగా ఈ అవార్డును గెలుచుకున్నాయి. సామాజిక కోణాలు, పాలన, సంస్కృతి, పట్టణ పర్యావరణం, పారిశుధ్యం, ఆర్థిక వ్యవస్థ, నిర్మించిన పర్యావరణం, నీరు, పట్టణ చైతన్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని స్మార్ట్ సిటీ అవార్డులను అందజేసినట్లు గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లో స్మార్ట్‌గా ఏడు నగరాలు:
స్మార్ట్ సిటీలుగా నగరాలను తీర్చిదిద్దడంలో ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉంది. ఏడు నగరాలను సొంతంగా స్మార్ట్ సిటీలుగా చేసినందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మొదటి బహుమతి లభించింది. మీరట్, ఘజియాబాద్, అయోధ్య, ఫిరోజాబాద్, గోరఖ్పూర్, మధుర-బృందావన్ మరియు సహారన్పూర్ నగరాలు స్మార్ట్ సిటీలుగా ఉన్నాయి.
కోవిడ్ ఇన్నోవేషన్ విభాగంలో కూడా సంక్షేమ మంత్రిత్వశాఖ ఉమ్మడి విజేతలను ప్రకటించారు. మహారాష్ట్రలోని కళ్యాణ్-డోంబివ్లి మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి ఈ అవార్డులను కైవసం చేసుకున్నాయి. ఈ మిషన్ కింద 5,924 ప్రతిపాదిత ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.లక్షా 78వేల కోట్లు అని మంత్రిత్వశాఖ తెలిపింది. మొత్తం 5,236 ప్రాజెక్టులకు వర్క్ ఆర్డర్లు జారీ చేసినట్లు చెప్పిన కేంద్రం.. రూ.45వేల 80కోట్ల విలువైన 2,665 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
9 నగరాలకు 4 స్టార్ రేటింగ్.. విజయవాడ, విశాఖలకు ప్లేస్:
70 స్మార్ట్ సిటీలు తమ సొంత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను అభివృద్ధి చేశాయని, క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్2.0 పై మంత్రిత్వ శాఖ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో 126 నగరాలు పాల్గొన్నాయి. ఉత్తమంగా పనిచేసే 9 నగరాకు 4స్టార్ రేటింగ్ ఇచ్చాయి. వీటిలో సూరత్, ఇండోర్, అహ్మదాబాద్, పూణే, విజయవాడ, రాజ్‌కోట్, విశాఖపట్నం, పింప్రి-చిన్చ్వాడ్ మరియు వడోదర ఉన్నాయి. స్మార్ట్ సిటీస్ లీడర్‌షిప్ అవార్డుకు అహ్మదాబాద్, వారణాసి, రాంచీ ఎంపికయ్యాయి.
తిరుపతికి ఐదు అవార్డులు:
తిరుపతి నగరానికి ఏకంగా ఐదు అవార్డులు లభించగా.. దేశంలో ఇండోర్, సూరత్ నగరాల తర్వాత ఐదు అవార్డులు దక్కించుకున్న ఏకైక నగరం తిరుపతే. పారిశుద్ధ్యం, ఈ-హెల్త్ విభాగాల్లో ఈ నగరానికి దేశంలోనే మొదటి స్థానం లభించగా.. బెస్ట్ సిటీ, ఎకానమీ విభాగాల్లో రెండో స్థానంలో నిలిచింది. అర్బన్ ఎన్విరాన్మెంట్ విభాగంలో మూడో స్థానం దక్కింది.
1. సామాజిక కోణాలు
తిరుపతి: మునిసిపల్ పాఠశాలలకు ఆరోగ్య బెంచ్ మార్క్
భువనేశ్వర్: సామాజికంగా స్మార్ట్ భువనేశ్వర్
తుమకూరు: డిజిటల్ లైబ్రరీ సొల్యూషన్
2. Governance
వడోదర: జి.ఐ.ఎస్
థానే: డిజి థానే
భువనేశ్వర్: ME అనువర్తనం
3. సంస్కృతి
ఇండోర్: వారసత్వ పరిరక్షణ
చండీఘర్: కాపిటల్ కాంప్లెక్స్, హెరిటేజ్ ప్రాజెక్ట్
గ్వాలియర్: డిజిటల్ మ్యూజియం
4. పట్టణ పర్యావరణం
భోపాల్: స్వచ్ఛమైన శక్తి
చెన్నై: నీటి వనరుల పునరుద్ధరణ
తిరుపతి: పునరుత్పాదక శక్తి ఉత్పత్తి
5. పారిశుధ్యం
తిరుపతి: బయోరిమిడియేషన్ & బయో మైనింగ్
ఇండోర్: మునిసిపల్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్
సూరత్: శుద్ధి చేసిన మురుగునీటి ద్వారా పరిరక్షణ
6. ఆర్థిక వ్యవస్థ
ఇండోర్: కార్బన్ క్రెడిట్ ఫైనాన్సింగ్ మెకానిజం
తిరుపతి: డిజైన్ స్టూడియో ద్వారా లోకల్ ఐడెంటిటీ & ఎకానమీని పెంచండి
ఆగ్రా: మైక్రో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్
7. నిర్మించిన పర్యావరణం
ఇండోర్: చప్పన్ డుకాన్
సూరత్: కెనాల్ కారిడార్
8. నీరు
డెహ్రాడూన్: స్మార్ట్ వాటర్ మీటరింగ్ వాటర్ ఎటిఎం
వారణాసి: అస్సీ నది యొక్క పర్యావరణ పునరుద్ధరణ
సూరత్: ఇంటిగ్రేటెడ్ మరియు సస్టైనబుల్ నీటి సరఫరా వ్యవస్థ
9. అర్బన్ మొబిలిటీ
ఔరంగాబాద్ : మాజి స్మార్ట్ బస్సులు
సూరత్: డైనమిక్ షెడ్యూలింగ్ బస్సులు
అహ్మదాబాద్: మనిషి-తక్కువ పార్కింగ్ వ్యవస్థ మరియు ఆటోమేటిక్ టికెట్ పంపిణీ యంత్రాలు AMDA పార్క్
10. ఇన్నోవేటివ్ ఐడియా అవార్డు
ఇండోర్: కార్బన్ క్రెడిట్ ఫైనాన్సింగ్ మెకానిజం
11. కోవిడ్ ఇన్నోవేషన్ అవార్డు
కళ్యాణ్-దొంబివాలి మరియు వారణాసి