Puri Jagannath temple: పూరీ జగన్నాథ్ ఆలయంలో రహస్య గదుల శోధన
రత్న భాండాగారం పరిస్థితి, అందులోని రహస్య గదులపై టీమ్ శోధిస్తోంది.

Puri's Jagannath temple
ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయంలో ప్రత్యేక టీమ్ రహస్య గదులను శోధిస్తోంది. శ్రీ క్షేత్రం ఆలయ పరిసరాల్లో మూడురోజుల పాటు ప్రత్యేక ఆంక్షలు విధించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదనపు డైరక్టర్ జనరల్ జాహ్న విజ్ శర్మ ఆధ్వర్యంలో 17 మంది సభ్యుల బృందం శోధన ప్రారంభించింది.
రత్న భాండాగారం పరిస్థితి, అందులోని రహస్య గదులపై టీమ్ శోధిస్తోంది. టెక్నికల్ టీమ్‌లో సీఎస్‌ఐఆర్, నేషనల్ జియో ఫిజికల్ రిసేరిచ్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నిపుణులు ఉన్నారు. లేజర్ స్కానింగ్, హైటెక్ గ్యాడ్జట్లతో రత్న భాండాగారాన్ని తనిఖీ చేస్తున్నారు.
రేపు సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగుతాయి. రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 వరకు శ్రీ క్షేత్రానికి భక్తులు రావద్దని సూచించారు. కాగా, ఈ ఏడాది జులైలోపూరీ శ్రీక్షేత్రం రత్న భాండాగారం తలుపులను దాదాపు 46 సంవత్సరాల విరామం తర్వాత తెరిచారు. ప్రతినిధులు భాండాగారం లోపలికి వెళ్లారు. గదుల్లోని ఆభరణాలను బయటకు తీసుకొచ్చారు.
నాసిరకం నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారు: చంద్రబాబు మరోసారి సంచలన కామెంట్స్