Jharkhand Political Crisis : ఝార్ఖండ్‌లో వీడిన రాజకీయ అనిశ్చితి..! సీఎంగా చంపై సోరెన్‌కు రూట్ క్లియర్.. సుప్రీంలో హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ

ఝార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వీడింది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభ పక్షనేత చంపై సోరెన్ ను ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాధాకృష్ణన్ ఆహ్వానించారు.

Champai Soren

Hemant Soren : ఝార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వీడింది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభ పక్షనేత చంపై సోరెన్ ను ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాధాకృష్ణన్ ఆహ్వానించారు. అయితే, పదిరోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని చంపై సోరేన్ ను గవర్నర్ ఆదేశించారు. గవర్నర్ సూచనతో ఇవాళ మధ్యాహ్నం చంపై సోరేన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లోని దర్బాల్ హాల్ లో 12.15 గంటలకు చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. చంపై సోరెన్ మాట్లాడుతూ.. మేమంతా ఐక్యంగా ఉన్నాం.. మా కూటమి బలంగా ఉంది, దానిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరంటూ వ్యాఖ్యానించారు.

Also Read : Hemant Soren Arrested: హేమంత్ సొరెన్‌ను అరెస్ట్ చేసిన ఈడీ.. బీజేపీపై రాహుల్, ఖర్గే ఫైర్

మాజీ సీఎం హేమంత్ సోరెన్ తమ్ముడు బసంత్ సోరెన్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతను డిప్యూటీ సీఎం పదవిని డిమాండ్ చేస్తున్నాడు. అయితే, మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. చంపై సోరెన్ తోపాటు బసంత్ సోరెన్, అలంగీర్ ఆలం, సత్యానంద్ భోక్తాలు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మరోవైపు తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ ఓ కన్నేసింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం శాసనసభా పక్ష సమవేశం జరగనుంది. 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని చంపై సోరెన్ కు గవర్నర్ సూచించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5న చంపై సోరెన్ మెజార్టీ నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహాకూటమికి చెందిన 47 మంది ఎమ్మెల్యేలు ఏకతాటిపై ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Also Read : Jharkhand Political Crisis : హైదరాబాద్ కేంద్రంగా ఝార్ఖండ్ రాజకీయాలు.. 35 మంది ఎమ్మెల్యేల తరలింపు

హేమంత్ సోరెన్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ..
ఝార్ఖండ్ లో భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోరెన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. అంతకుముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈడీ సోరెన్ ను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. అయితే, సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్ కు ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఎందుకు వెళ్లలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో దాఖలైన ఈ పిటీషన్ ను నేరుగా విచారించలేమని కోర్టు తెలిపింది. పిటీషనర్ కు హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఇదిలాఉంటే హేమంత్ సోరెన్ పిటీషన్ ఫిబ్రవరి 5న హైకోర్టులో విచారణ జరగనుంది.

 

  • చంపై సోరెన్ రాజకీయ జీవితం..
    చంపై సోరెన్ 1991లో సెరైకెలా స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.
    నాలుగేళ్ల తరువాత ఝార్ఖండ్ ముక్తి మోర్చా టికెట్ పై ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించాడు.
    2000 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.
    2005 ఎన్నికల్లో 880 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
    2009, 2014, 2019 వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
    2019లో రాష్ట్రంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. ఆహార, పౌరసరఫరాల, రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
    చంపై .. హేమంత్ సోరెన్ కు అత్యంత సన్నిహితుడు. చంపై సోరెన్ శిబు సోరెన్ ను తన రాజకీయ ఆదర్శంగా భావిస్తాడు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు