Jharkhand Political Crisis : హైదరాబాద్ కేంద్రంగా ఝార్ఖండ్ రాజకీయాలు.. 35 మంది ఎమ్మెల్యేల తరలింపు
హైదరాబాద్ కేంద్రంగా ఝార్ఖండ్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ అరెస్ట్ తో అప్రమత్తమైన కాంగ్రెస్.. తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు.

Jharkhand Politics
Jharkhand MLAs to Hyderabad : హైదరాబాద్ కేంద్రంగా ఝార్ఖండ్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ అరెస్ట్ తో అప్రమత్తమైన కాంగ్రెస్.. ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ప్రత్యేక విమానం ద్వారా 35 మంది ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. గచ్చిబౌలిలో హోటల్ ఎల్లాలో ఝార్ఖండ్ ఎమ్మెల్యేలకు వసతి కల్పించారు.
ఝార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. సీఎం పదవికి హేమంత్ సొరెన్ రాజీనామా చేశారు. భూ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు జేఎంఎం అధినేత హేమంత్ సొరెన్ ను అరెస్టు చేశారు. ఆ రాష్ట్రంలో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలు చేజారకుండా, ప్రభుత్వం మారకుండా కాంగ్రెైస్ పార్టీ చర్యలు చేపట్టింది. ఇండియా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించాలని హైకమాండ్ భావించింది. అందులో భాగంగా 35 మంది కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించారు. ప్రత్యేక విమానం ద్వారా బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారందరూ హోటల్ ఎల్లాలో ఉండనున్నారు.
Also Read : Union Budget 2024-25 : కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లో శాఖలవారిగా కేటాయింపులు ఇవే..