Bhagat Singh International Airport: ఛండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు భగత్ సింగ్ పేరు.. పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి అంగీకారం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఛండీగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఛండీగ్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చేందుకు పంజాబ్, హర్యానా అంగీకరించాయి. ఈ విషయమై ఈరోజు హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలాతో సమావేశం అయ్యాను’’ అని హిందీలో ట్వీట్ చేశారు

Chandigarh International Airport to be named as Bhagat Singh
Bhagat Singh International Airport: పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన ఛండీగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మారింది. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పేరును ఎయిర్‌పోర్ట్‌కు నామకరణం చేశారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపాయి. ఈ విషయమై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ సింగ్ చౌతాలా శనివారం సమావేశమై చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ విషయమై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఛండీగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఛండీగ్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చేందుకు పంజాబ్, హర్యానా అంగీకరించాయి. ఈ విషయమై ఈరోజు హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలాతో సమావేశం అయ్యాను’’ అని హిందీలో ట్వీట్ చేశారు. ప్రభుత్వ ప్రక్రియలు తొందరలోనే పూర్తి చేసుకుని విమానాశ్రాయినిక అధికారికంగా భగత్ సింగ్ పేరు వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
चंडीगढ़ के अंतरराष्ट्रीय हवाई अड्डे का नाम शहीद भगत सिंह जी के नाम पर रखा जाएगा इस पर पंजाब और हरियाणा के बीच सहमति बनी…
आज हरियाणा के उपमुख्यमंत्री दुष्यंत चौटाला के साथ इस मसले पर मीटिंग की pic.twitter.com/ahkSP6PTBr
— Bhagwant Mann (@BhagwantMann) August 20, 2022
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వరదలు.. 22 మంది మృతి, ఐదుగురు మిస్సింగ్