Aurangabad name change : ఔరంగాబాద్ పేరు మార్చడానికి రూ.1,000 కోట్లు ఖర్చు..
ఔరంగాబాద్ నగరం పేరు మార్చటానికి రూ.1000 కోట్లు ఖర్చు చేస్తారా? ఇది ప్రజల సొమ్ము కాదా? అంటూ ప్రశ్నించారు ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్.

Changing The Name Of Aurangabad Will Put A Burden Of Around Rs 1000 Crores
Aurangabad name change : ఔరంగాబాద్ నగరం పేరు మార్చటానికి రూ.1000 కోట్లు ఖర్చు చేస్తారా? ఇది ప్రజల సొమ్ము కాదా? అంటూ ప్రశ్నించారు ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్. మహారాష్ట్రలోని ప్రముఖ చారిత్రక పట్టణం ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా ఉద్దవ్ థాకరే ఆధ్వర్యంలోని ప్రభుత్వం పతనం చివరి ఘడియల్లో మార్చింది. దీనిపై ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఉద్ధవ్, శరత్ పవార్ లపై విమర్వలు చేస్తూ..ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చివరి ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఈక్రమంలో మరోసారి ఈ విషయంపై మాట్లాడిని ఎంపీ ఇంతియాజ్ ఔరంగాబాద్ పేరు మార్చటం నిర్ణయం వల్ల ప్రజలపై పెను భారం పడుతుందని ఓ పట్టణం పేరు మార్చటానికి దాదాపు రూ.1000 ఖర్చు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ప్రజలపై పడే భారం గురించి ఎంపీ మాట్లాడారు.
Also read : Sambhaji Nagar: ఔరంగబాద్ కాదు.. శంభాజీ నగర్!
ఈ సందర్భంగా ఎంపీ ఇంతియాజ్ మాట్లాడుతూ..‘‘కొందరు ప్రతి దానికీ మతం రంగు పులమాలని చూస్తుంటారు. ఇది హిందువులు, ముస్లింలకు సంబంధించినది కాదు. ఒక వ్యక్తి తరచుగా అతడు లేదా ఆమె ఫలానా పట్టణానికి చెందిన వారిగా గుర్తింపునకు నోచుకుంటారు అని అన్నారు. పట్టణం పేరు మార్చటానికి భారీగా ఖర్చు అవుతుంది. చిన్న పట్టణానికి పేరు మార్చడం కోసం రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని ఓ నివేదిక చదివి తెలుసుకున్నానని తెలిపారు. చిన్నపట్టటానికే రూ.500ల కోట్లు ఖర్చు అయితే..అదే ఔరంగాబాద్ వంటి పట్టణానికి అయితే పేరు మార్పునకు రూ.1,000 కోట్లు ఖర్చు అవుతుందని ఢిల్లీ అధికారి ఒకరు తెలిపారని..ఈ ఖర్చు కూడా కేవలం ప్రభుత్వ డాక్యుమెంట్లు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో పేరు మార్పునకు చేయాల్సిన ఖర్చు అని వెల్లడించారు. ఈ ఖర్చుకు అయ్యేది అంతా ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి కట్టినది కాదా? ఈ ఖర్చుకు సంబంధించిన ప్రతీ రూపాయలు మీది, నాది’’ అంటూ వివరించారు ఎంపీ జలీల్.
ఓ పట్టణం పేరు మార్చటం అంటే మాటలతో అయ్యే పనికాదని పట్టణం పేరు మారితే ప్రజలకు వచ్చే ఇబ్బందులను కూడా ఎంపీ ఇంతియాజ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దానికి ఉదాహరణగా ‘‘నాకు ఓ షాపు ఉంటే నేను డాక్యుమెంట్ లో పేరును మార్చుకోవాలి. కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలి. ఇందుకోసం ఎవరికి వారే క్యూలో నించోవాలి. దాని కోసం మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే రారు..అలాగే గత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన శరద్ పవార్ రారు..అలాగే ఏ నేతలు వచ్చి మనకోసం లైన్లలో నిలబడరు ప్రజలు ఎవరికి వారే ఈ పనులు చేసుకోవాలి..ఇంత పేరు మార్పు వల్ల కాదా? అని ప్రశ్నించారు. ఇవన్నీ సామాన్య ప్రజల కష్టాలు..అంటూ వివరించారు.
ఈ చర్య గురించి తనకు తెలియదని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యను కూడా ఎంపీ ఇంతియాజ్ విమర్శించారు. “ఈ స్థలాల పేరు మార్చడం MVA యొక్క సాధారణ కనీస కార్యక్రమంలో భాగం కాదు” అని పవార్ విలేకరులతో చెప్పారు.”నిర్ణయం తీసుకున్న తర్వాతే నాకు తెలిసిందని అన్నారు. ఇది ముందస్తు సంప్రదింపులు లేకుండా తీసుకోబడింది. ప్రతిపాదనపై కేబినెట్ సమావేశంలో మా ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ (అప్పటి) ముఖ్యమంత్రి (ఠాక్రే) నిర్ణయం తీసుకున్నారు.” అని అన్నారు. ఎన్‌సిపి కురువృద్ధుడు శరత్ పవార్ పై జలీల్ ఇలా అన్నారు: “కేబినెట్ సమావేశంలో పేరుమార్పు ప్రతిపాదన గురించి తనకు తెలియదని..అది ఆమోదించిన తర్వాతే తనకు తెలిసిందని పవార్ చేసిన ప్రకటన నవ్వు తెప్పిస్తోంది అంటూ ఎద్దేవా చేశారు.
#WATCH | Maharashtra: Changing the name of Aurangabad will put a burden of around Rs 1000 crores on the govt. This is only to change the documents of the government department. Common people have to go through a burden of several thousand crores: AIMIM MP Imtiaz Jaleel (11.07) pic.twitter.com/hr17HeSxBF
— ANI (@ANI) July 12, 2022