Sambhaji Nagar: ఔరంగబాద్ కాదు.. శంభాజీ నగర్!

ఔరంగబాద్ నగరం పేరును శంభాజీ నగర్‌గా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గుర్తుగా ఔరంగబాద్ నగరాన్ని శంభాజీ నగర్‌గా మార్చారు. అలాగే ఒస్మానాబాద్ నగరం పేరును ధారాశివ్‌గా మార్చారు.

Sambhaji Nagar: ఔరంగబాద్ కాదు.. శంభాజీ నగర్!

Sambhaji Nagar

Sambhaji Nagar: మహారాష్ట్రలో ఒకపక్క తన ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ సీఎంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఉద్ధవ్ థాక్రే. మంగళవారం క్యాబినెట్ భేటీ నిర్వహించి ఎప్పట్నుంచో పెండింగులో ఉన్న ప్రతిపాదనల్ని ఆమోదించారు. తాజా సమాచారం ప్రకారం… క్యాబినెట్ భేటీలో మహారాష్ట్రలోని రెండు నగరాల పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Maharashtra CM: ‘మహా’ సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం?

ఔరంగబాద్ నగరం పేరును శంభాజీ నగర్‌గా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గుర్తుగా ఔరంగబాద్ నగరాన్ని శంభాజీ నగర్‌గా మార్చారు. అలాగే ఒస్మానాబాద్ నగరం పేరును ధారాశివ్‌గా మార్చారు. ఈ రెండింటికీ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. మహారాష్ట్ర రవాణా శాఖా మంత్రి అనిల్ పరాబ్‌తోపాటు రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఔరంగబాద్ పేరును మార్చాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ పేర్ల మార్పు గురించి కొద్ది రోజుల కిందే ఉద్ధవ్ థాక్రే మాట్లాడారు.

Anasuya : జబర్దస్త్‌కి వరుస ఝలక్‌లు.. అనసూయ కూడా గుడ్‌బై??

‘‘మా పార్టీ బాలాసాహెబ్ థాక్రే హిందూత్వ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తుంది. హిందూత్వ మా శ్వాసలోనే ఉంది. అబద్దాలు చెప్పడం మా సిద్దాంతం కాదు. ఔరంగబాద్ పేరును శంభాజీ నగర్‌గా మార్చాలని బాలసాహెబ్ థాక్రే కోరేవారు. ఆయన ఆశయాల్ని మేం నెరవేరుస్తాం’’ అని ఒక సభలో ప్రకటించారు. దీనికి అనుగుణంగానే తాజాగా ఔరంగబాద్ పేరు మార్చారు.