రణరంగంగా మారిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ.. దాడిచేసుకున్న ఎమ్మెల్యేలు.. వీడియోలు వైరల్

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370 పునరుద్దరణపై గురువారం చర్చ జరిగింది. అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ మాట్లాడుతుండగా..

రణరంగంగా మారిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ.. దాడిచేసుకున్న ఎమ్మెల్యేలు.. వీడియోలు వైరల్

Jammu Kashmir Assembly

Updated On : November 7, 2024 / 1:13 PM IST

Jammu Kashmir Assembly: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రణరంగంగా మారింది. ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దూసుకుపోయి పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. మార్షల్స్ రంగంలోకిదిగి తన్నుకుంటున్న ఎమ్మెల్యేలను విడదీశారు. ఆ తరువాత బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు పంపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 2019లో కేంద్రం తొలగించిన ఆర్టికల్ 370, 32ఎ ను పునరుద్దరించాలని కోరుతూ పీడీపీ అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టింది. ప్రత్యేక రాష్ట్ర హోదాను కూడా ఇవ్వాలని కోరింది. దీనిని బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు.

Also Read: Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ఐదు గ్యారెంటీలను ప్రకటించిన మహా వికాస్ అఘాడి కూటమి.. అవేమిటంటే?

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370 పునరుద్దరణపై గురువారం చర్చ జరిగింది. అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ మాట్లాడుతుండగా.. అవామీ ఇత్తెహాద్‌ పార్టీ నేత, బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ సోదరుడు ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370 బ్యానర్ తో వచ్చి వెల్ లోకి దూకి బ్యానర్ ను ఊపడం ప్రారంభించాడు. దీంతో ఆ పార్టీ, విపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం మొదలైంది. బ్యానర్ ను చూపించడాన్ని బీజేపీ వ్యతిరేకించింది. దీంతో అసెంబ్లీ సమావేశంలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభ్యులు ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో మార్షల్స్ వచ్చి తన్నుకుంటున్న వారిని విడదీశారు. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు పంపారు.

 

ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఖుర్షీద్ కు అనుకూలంగా స్పీకర్ పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నారని ఆరోపించారు. దీంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా స్పందిస్తూ.. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీలు జాతి వ్యతిరేక శక్తులకు ఆశ్రయం ఇస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పాక్ తో చేయి కలిపిందని, ఉగ్రవాదులతో చేయి కల్పిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖుర్షీద్ అహ్మద్ షేక్ మాట్లాడుతూ.. ఇదంతా బీజేపీ జీర్ణించుకోలేక పోతుంది. దాడి చేశారు. కానీ, మాపై ఇలాంటి దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కానీ, ప్రజల అభిప్రాయాలు చెప్పేందుకు మమ్మల్ని అసెంబ్లీకి పంపారు. తగిన విధంగా అసెంబ్లీలో మా అభిప్రాయాలను తెలియజేస్తామని చెప్పాడు.