Tortoise Rescued: తాబేలును రక్షించిన కోస్ట్ సెక్యూరిటీ: నిర్మలా సీతారామన్ ప్రశంస

అంతరించిపోయే దశలో ఉన్న ఆలివ్ రిడ్లే తాబేలు రక్షించిన కోస్టల్ సిబ్బందిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు అభినందించారు

Tortoise Rescued: తాబేలును రక్షించిన కోస్ట్ సెక్యూరిటీ: నిర్మలా సీతారామన్ ప్రశంస

Costal

Updated On : February 3, 2022 / 10:50 PM IST

Tortoise Rescued: సముద్రంలో పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు, తెగిపడిన చేపల వలల కారణంగా సముద్ర జీవులు ప్రమాదంలో చిక్కుకుంటున్నాయి. చేప వలలో చికుక్కుకుని నడిసముద్రంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఒక తాబేలును చెన్నై కోస్ట్ సెక్యూరిటీ అధికారులు రక్షించిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. తాబేలు వలలో చిక్కుకుని విలవిలాడుతుండగా.. అదే సమయంలో తీరంలో గస్తీ తిరుగుతున్న కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది దాన్ని రక్షించారు. ఈ ఘటన తాలూకు దృశ్యాలు కస్టమ్స్ అధికారులు ట్విట్టర్ ఖాతాలో పంచుకోగా.. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. స్పందిస్తూ.. కోస్టల్ సిబ్బందిని ప్రశంసించారు.

Also read: ISIS Chief Death: అమెరికా బలగాలను చూసి ఇల్లు పేల్చుకుని ఐసిస్ చీఫ్ మృతి

ఆలివ్ రిడ్లే జాతికి చెందిన తాబేలు వలలో చిక్కుకుంది. దాన్ని గమనించిన కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది.. పడవలోకి తీసుకొచ్చారు. పూర్తిగా వలతో చుట్టుకుపోయిన తాబేలును చూసిన సిబ్బంది.. వెంటనే వలను కత్తిరించి తిరిగి సముద్రంలో వదిలేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అయింది. అంతరించిపోయే దశలో ఉన్న ఆలివ్ రిడ్లే తాబేలు రక్షించిన కోస్టల్ సిబ్బందిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు అభినందించారు. మత్స్యకారుల వలల కారణంగా సముద్ర జీవులు ప్రమాదంలో చిక్కుకుంటున్నాయని.. వలలను సముద్రంలో వదలకుండా మత్స్యకారులకు అధికారులు అవగాహన కల్పించాలంటూ ప్రజలు సూచిస్తున్నారు.