Double-Vaccinated: ఆ ట్రైన్ ఎక్కాలంటే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని ఉండాల్సిందే
డబుల్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటేనే చెన్నై లోకల్ ట్రైన్ ఎక్కేందుకు అనుమతి ఉంటుందని దక్షిణ రైల్వే ప్రకటించింది. జనవరి 10 నుంచి జనవరి 31 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది.

Double Vaccinated
Double-Vaccinated: డబుల్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటేనే చెన్నై లోకల్ ట్రైన్ ఎక్కేందుకు అనుమతి ఉంటుందని దక్షిణ రైల్వే ప్రకటించింది. జనవరి 10 నుంచి జనవరి 31 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. రెండుసార్లు కొవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్నట్లు సర్టిఫికేట్ లేని వారికి ట్రైన్ టిక్కెట్ కొనుగోలు చేసేందుకు వీలుండదు.
ఒమిక్రాన్ వేవ్ కారణంగా జాగ్రత్తలు తప్పనిసరి అని కొవిడ్ వ్యాప్తికి సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది కేవలం డైలీ టిక్కెట్ వారికి మాత్రమే కాకుండా సీజన్ టికెట్ హోల్డర్లకు కూడా వర్తిస్తుందట. ఈ సమయంలో అన్ రిజర్వ్ డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS)కూడా అందుబాటులో ఉండదని తెలిసింది.
రీసెంట్ గా తమిళనాడులో శుక్రవారం 8వేల 981కేసులు నమోదుకాగా, చెన్నై, కొయంబత్తూరు, కాంచీపురం, తిరువల్లూరులలో గరిష్ఠంగా కేసులు నమోదయ్యాయి. రాజధాని చెన్నైలోనే ఏకంగా 4వేల 531కేసులు రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఒక్కరోజులో 20వేల కొవిడ్ కేసులు
ఇప్పటివరకూ తమిళనాడులో 121 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదుకాగా, 117మంది రికవరీ అయ్యారు. గడిచిన 24గంటల్లో కొవిడ్ కారణంగా 8మంది మృతిచెందగా రాష్ట్రంలో మృతుల సంఖ్య 36వేల 833కు చేరింది. అలాగే 24గంటల్లో 984మంది రికవరీ అయ్యారని తెలిసింది.