Covid Cases: ఢిల్లీలో ఒక్కరోజులో 20వేల కొవిడ్ కేసులు

ఢిల్లీ హెల్త్ మినిష్టర్ సత్యేందర్ జైన్ శనివారం మాట్లాడుతూ.. ఒక్కరోజులోనే దాదాపు 20వేల కొవిడ్ కేసులు నమోదయ్యయాని పాజిటివిటీ రేటు 19శాతంగా ఉందని పేర్కొన్నారు.

Covid Cases: ఢిల్లీలో ఒక్కరోజులో 20వేల కొవిడ్ కేసులు

TS Covid Update

Updated On : January 8, 2022 / 3:16 PM IST

Covid Cases: ఢిల్లీ హెల్త్ మినిష్టర్ సత్యేందర్ జైన్ శనివారం మాట్లాడుతూ.. ఒక్కరోజులోనే దాదాపు 20వేల కొవిడ్ కేసులు నమోదయ్యయాని పాజిటివిటీ రేటు 19శాతంగా ఉందని పేర్కొన్నారు. గురువారం కరోనావైరస్ ఇన్ఫెక్షన్ ఎదుర్కొన్న రోగులందరిలో కమోర్బిడిటీస్ ఎక్కువగా ఉన్నాయని సత్యేందర్ జైన్ అన్నారు.

‘కాకపోతే హాస్పిటల్ అడ్మిషన్స్ ఈ సమయంలో చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగానే ఉండి రోజుకు 20వేల కేసులు నమోదవుతున్నాయి. దాంతో పాటు సిటీలో ఇప్పటివరకూ ఒమిక్రాన్ వేరియంట్ కేరణంగా ఒక్కరు కూడా మృతి చెందలేదని’ పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రేపేర్డ్ గా ఉందని.. అవసరమైన పరకరాలతో రెడీ చేసుకుందని చెప్పారు సత్యేందర్. ఇప్పటి వరకూ ఢిల్లీ హాస్పిటల్స్ లో 10శాతం బెడ్లు మాత్రమే బిజీ అయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్ కు చేరే వారి సంఖ్య కూడా తప్పిందని చెబుతున్నారు సత్యేందర్.

ఇది కూడా చదవండి: సెలబ్రిటీలను చుట్టేస్తున్న కరోనా.. ఉదృతంగా వ్యాప్తి!

‘ప్రస్తుతం ఢిల్లీలో 40వేల యాక్టివ్ కేసులు, ఉండగా 10శాతం బెడ్లు మాత్రమే ఫుల్ అయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో 40వేల యాక్టివ్ కేసులున్నప్పుడు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యేందుకు పేషెంట్లు పడిగాపులు పడ్డారు’ అని వివరించారు.

తేలికపాటి లక్షణాలుంటే.. హోమ్ ఐసోలేషన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు హెల్త్ మినిష్టర్.