Taj Hotel : ఉగ్రవాదులు వస్తున్నారంటూ బాలుడు ఫోన్
ముంబైలోని తాజ్ హోటల్ కు ఉగ్రవాదులు వస్తున్నారంటూ ఓ బుడతడు పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రత కట్టుదిట్టం చేశారు. చివరకు అది ఫేక్ కాల్ అని తెలుసుకున్నారు

Taj Hotel
Taj Hotel : ముంబై తాజ్ హోటల్ లో ఇద్దరు ఉగ్రవాదులు ప్రవేశిస్తారంటూ ఓ బాలుడి గొంతుతో పోలీసులకు ఫోన్ వచ్చింది. సాయుధులైన ఇద్దరు టెర్రరిస్టులు శనివారం సాయంత్రం 3.30 నిమిషాల సమయంలో హోటల్ రిషప్షన్ లోకి ఎంట్రీ ఇస్తారని తెలిపాడు. దీంతో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు.
డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తాజ్ హోటల్ దగ్గరకు పరుగుపరుగున చేరుకున్నారు. హోటల్ చుట్టు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అనంతరం హోటల్ లోపల తనిఖీలు చేపట్టారు. ఇక మరోవైపు పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. చివరకు అతడు తొమ్మిదో తగరతి బాలుడిని, ఫేక్ కాల్ చేశాడని గుర్తించారు. కాగా ఇంతవరకు బాలుడిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని తెలుస్తుంది.