మృత్యుంజయుడు : బోరు బావిలో పడిన చిన్నారి సేఫ్

  • Published By: madhu ,Published On : January 28, 2019 / 02:38 AM IST
మృత్యుంజయుడు : బోరు బావిలో పడిన చిన్నారి సేఫ్

Updated On : January 28, 2019 / 2:38 AM IST

మధ్యప్రదేశ్ : బోరుబావిలో పడిపోయిన చిన్నారి క్షేమంగా రావాలంటూ ఆ తల్లిదండ్రుల నిరీక్షణ ఫలించింది. రెండేళ్ల చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 70 అడుగుల లోతైన బోరు బావిలో ఆదివారం ఉదయం చిన్నారి పడిపోయిన సంగతి తెలిసిందే. క్షేమంగా బయటకు తీసిన చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా కెర్హర్‌లో జనవరి 28వ తేదీ తేజ్ ప్రతాప్ సింగ్ రెండేళ్ల చిన్నారి ఆడుకుంటూ 70 అడుగుల లోతులో పడిపోయింది. ఉదయం 8గంటలకు ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న జిల్లా..గ్రామ అధికారులు బోరు బావి ప్రదేశానికి చేరుకున్నారు. బోరుబావికి సమీపంలోనే పెద్ద రంధ్రాన్ని చేశారు. చిన్నారితో మాట్లాడిస్తూ తవ్వకాలు జరిపారు. తమ బిడ్డ ఎలా ఉందో అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

తవ్విన రంధ్రంలోకి 10 మీటర్ల లోతులోకి సహాయక బృందంలోని ఒక సభ్యుడు దిగాడు. చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. 70 అడుగుల లోతులో పడినా..చిన్నారికి ఏమాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. ఎందుకైనా మంచిదని అధికారులు తేజ్ ప్రతాప్ సింగ్‌ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనుమతులు లేకుండా బోరు బావిని తవ్వారని…దాని యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారి అనురాగ్ వెల్లడించారు.