చైనా వక్రబుద్ధి : పుల్వామా దాడిని ఖండిస్తూనే.. జైషే మహమద్ పై ప్రేమ

పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూనే చైనా ప్రపంచం ముందు మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. పుల్వామా జిల్లాలో గురువారం పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమద్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో 49మంది జావాన్లు అమరులైన ఘటనపై శుక్రవారం(ఫిబ్రవరి-15,2019) చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్ షుయాంగ్ మాట్లాడుతూ.. పుల్వామా ఘటన తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. ఉగ్రవాదఆన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.ఉగ్రవాద నిరోధానికి ఎప్పుడూ కృషి చేస్తాం. అమరులైన, గాయపడిన జవాన్ల కుటుంబాలకు సానుభూతి, ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని షుయాంగ్ అన్నారు.
యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా జైషే మహమద్ ఉగ్రసంస్థ నాయకుడు మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్ పై చైనా వైఖరిని ప్రశ్నించగా…యూఎన్ కమిటీ ఆంక్షల జాబితాలో జేషే మహమద్ ఇప్పటికే ఉందన్న షుయాంగ్ మసూద్ అజర్ పై బ్యాన్ కి మాత్రం చైనా ఎందుకు అడ్డుపడుతుందో చెప్పకుండా సమాధానం దాటవేశారు.
లిస్టింగ్ విషయానికి సంబంధించినంతవరకు లిస్టింగ్, టెర్రరిస్ట్ గ్రూప్ లపై ప్రొసీజర్ కు 1267 సెక్యూరిటీ కౌన్సిల్ కమిటీ పూర్తి ఒప్పందం కలిగి ఉందని తెలిపారు.సెక్యూరిటీ కౌన్సిల్ ఆంక్షల జాబితాలో జైషే మహమద్ ఉందని, ఈ విషయంలో ఆంక్షలు విధించేందుకు చైనా నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుతమైన పద్ధతిని అవలంభిస్తోందని’ ఆయన తెలిపారు. యూఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ కనుక మసూద్ అజర్ ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటిస్తే.. అజర్ పై గ్లొబల్ ట్రావెల్ బ్యాన్ కొనసాగడమే కాకుండా అతడి ఆస్తులు ఫ్రీజ్ అవుతాయి.
యూఎన్ లో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి అతడిపై నిషేధం విధించాలని భారత్ పలుమార్లు చేసిన ప్రతిపాదనను భద్రతా మండలిలో వీటో అధికారం కలిగి శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనా తిరస్కరిస్తూ వస్తోంది. ఈ విషయంలో భారత్‌కు అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు మద్దతు పలికాయి. అయితే.. మసూద్ ఉగ్రవాది అనేందుకు సరైన కారణాలు చూపించడం లేదని చెప్పుకొస్తూ భారత్ ప్రతిపాదనలను వీటో అధికారం ఉపయోగించి డ్రాగన్ దేశం తిరస్కరిస్తోంది
Also Read : పాక్ అంతుచూద్దాం : మోడీకి కాంగ్రెస్ మద్దతు
Also Read : ఉగ్రదాడి : కన్నబిడ్డను కళ్లారా చూడకుండానే జవాన్ మరణం
Also Read : విరాళం ఇవ్వాలంటే: వీరజవాన్ల కుటుంబాలను ఆదుకోండిలా