చేప తిన్నాడు…లివర్ సగం గాయబ్ ..ఎందుకలా ? ఏమి జరిగింది ?

  • Published By: madhu ,Published On : July 25, 2020 / 10:31 AM IST
చేప తిన్నాడు…లివర్ సగం గాయబ్ ..ఎందుకలా ? ఏమి జరిగింది ?

Updated On : July 25, 2020 / 11:22 AM IST

చేపలు తింటున్నారా..అయితే మీ కోసమే..ఎందుకంటే చేప ఫుడ్ తినడంతో అతని లివర్ గాయబ్ అయ్యింది. సగం మాత్రమే ఉందని గుర్తించారు వైద్యులు. ఓ పురుగులాంటి జీవి లివర్ ను తింటోందని తెలుసుకున్నారు.

చైనాలోని హ్యాంగ్జౌ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి గత నాలుగు రోజులుగా విరేచనాలు, కడుపునొప్పి, ఇతర కారణలతో బాధ పడుతున్నాడు. ఆసుపత్రికి వెళ్లగా..వైద్యులు అతడిని పరీక్షించారు. రిపోర్టులు చూసి షాక్ అయ్యారు. అతడి కాలేయం సగం మాత్రమే ఉందని గుర్తించారు.

ఎందుకిలా జరిగిందని లోతుగా పరిశీలిస్తే..ఓ పురుగు అతని కాలేయాన్ని తినేస్తుందని నిర్ధారించారు. 19 సెంటిమీటర్ల పొడవు, 18 సెంటిమీటర్ల వెడల్పు ఉన్న ఓ చీము గడ్డ కూడా కనిపించింది. దాని చుట్టూ పెద్ద పెద్ద గడ్డలు కూడా ఏర్పడడాన్ని గుర్తించారు. వీటిని సూక్ష్మంగా పరిశీలించారు.

ఇది పురుగుల వల్ల ఏర్పడినట్లు తెలుసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాలేయాన్ని తొలగించాల్సి వచ్చిందని వైద్యులు వెల్లడించారు. అసలు ఏం జరిగిందో వైద్యులకు తెలియచేశాడు. చేపలను ఉడకబెట్టకుండా తింటానని తెలిపాడు. చేపల్లో కంటికి కనిపించని పరాన్నజీవులు ఉంటాయని వీటిని పచ్చిగా తీసుకొనే సమయంలో వాటిలో ఉండే ఈ జీవులు, బ్యాక్టిరీయా కూడా శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్యులు తెలిపారు.

శరీర అవయవాలను కొరుక్కు తింటూ క్రమేనా అనారోగ్య సమస్యలు కలిగిస్తాయన్నారు. చేపను పూర్తిగా ఉడికించకుండా..తినేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని డాక్టర్లు తెలిపారు.