Hindu Sena: సావర్కర్ పోస్టర్ తాకితే చేతులు నరికేస్తాం

వీర్ సావర్కర్, బాలగంగాధర్ తిలక్ చిత్రాలను గణేష్ చతుర్థి ఫెస్టివల్ ప్లెక్సీలో పెడతామని హిందూ మహాసభ గౌరీ గణేషా సేవాసమితి అధ్యక్షుడు రాకేష్ రామ్మూర్తి చెప్పారు. వీర్ సావర్కర్, తిలక్‌ల చిత్రాలను కర్ణాటక రాష్ట్రంలోని 15వేల ప్రాంతాల్లో పెట్టి వారికి నివాళులు అర్పిస్తామని ప్రమోద్ ముతాలిక్ వివరించారు.

Hindu Sena: సావర్కర్ పోస్టర్ తాకితే చేతులు నరికేస్తాం

chop hands if they touch savarkar posters says hindusena

Updated On : August 23, 2022 / 3:14 PM IST

Hindu Sena: వీర్ సావర్కర్ పోస్టర్లు తాకితే చేతులు నరికేస్తామని హిందూ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో సావర్కర్ ఫొటోలను తొలగించిడంపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ హిందూత్వ ఐడియాలజీకి సావర్కర్ హీరోలాంటి వాడని, అలాంటి వ్యక్తి పోస్టర్లను తొలగించే ఉద్దేశంతో ఎవరైనా తాకితే వారి చేతుల్ని హిందూసేన కార్యకర్తలు నరికేస్తారని హెచ్చరించారు.

‘‘వీర్ సావర్కర్ పోస్టర్లను తాకితే, వారి చేతులు నరికిపారేస్తాం, ఇది మా హెచ్చరిక’’అని శ్రీరామ సేన అనుబంధ సంస్థ రాష్ట్రీయ హిందూసేన చీఫ్ అయిన ప్రమోద్ ముతాలిక్ హెచ్చరించారు. సావర్కర్ గురించి తాము అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తామని ఆయన తెలిపారు. దేశం కోసం సావర్కర్ 23 ఏళ్లపాటు పోరాటం చేశారని, ఆయన ముస్లింలకు వ్యతిరేకం కాదని బ్రిటీసు వారిపై పోరాటం చేశాడని ఆయన పేర్కొన్నారు.

వీర్ సావర్కర్, బాలగంగాధర్ తిలక్ చిత్రాలను గణేష్ చతుర్థి ఫెస్టివల్ ప్లెక్సీలో పెడతామని హిందూ మహాసభ గౌరీ గణేషా సేవాసమితి అధ్యక్షుడు రాకేష్ రామ్మూర్తి చెప్పారు. వీర్ సావర్కర్, తిలక్‌ల చిత్రాలను కర్ణాటక రాష్ట్రంలోని 15వేల ప్రాంతాల్లో పెట్టి వారికి నివాళులు అర్పిస్తామని ప్రమోద్ ముతాలిక్ వివరించారు.

Honey Trapping : హానీ‌ట్రాప్‌లో ఆర్ఎస్ఎస్ నాయకుడు, బంగారం వ్యాపారి-మహిళ అరెస్ట్