సుప్రీంకోర్టుకి క్షమాపణ చెప్పిన రాహుల్

  • Published By: venkaiahnaidu ,Published On : April 22, 2019 / 08:40 AM IST
సుప్రీంకోర్టుకి క్షమాపణ చెప్పిన రాహుల్

Updated On : April 22, 2019 / 8:40 AM IST

కాంగ్రెస్ చీఫ్ రాహల్ గాంధీ సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. రాఫెల్ కుంభకోణం అంశంపై ప్రధాని నరేంద్రమోడీని చోర్ అని అన్నందుకు క్షమాపణ చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విష‌యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీని ‘చౌకీదార్ చోర్’ అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై సుప్రీం వివ‌ర‌ణ కోరింది. దీనిపై రాహుల్ సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు.
ఆవేశంలో అలా అన్నానని రాహుల్ కోర్టు ముందు అంగీక‌రించారు. తాను అలా మాట్లాడ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని..ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న క్రమంలో ఆవేశంతో అలా వ్యాఖ్యానించానని తెలిపారు. కోర్టు త‌న తీర్పులో ఆ మాట‌ల‌ను మోడీకి ఆపాదించ‌లేద‌ని రాహుల్ అన్నారు.కాగా మోడీపై రాహల్ గాంధీ చేసిన ఈ ‘ మోడీ చోర్’ విషయంపై బీజేపీ ఎంపీ మీనాక్షి లెఖీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. రాహుల్ ఉద్దేశపూర్వకంగానే ప్రధానిపై ఈ వ్యాఖ్యలు చేసారని పిటీషన్ లో ఆమె తెలిపారు.