క్రిస్‌మస్ చెట్టు ప్రత్యేకత..ఎలా ప్రారంభమైందంటే..

డిసెంబర్ నెల రాగానే అంతటా క్రిస్మస్ సందడి ప్రారంభమైపోతుంది. అందరి ముంగిళ్లలోనూ క్రిస్మస్ ట్రీలు ప్రత్యక్షమవుతాయి. క్రిస్మస్.. క్రైస్తవుల ఆరాధ్యుడైన యేసు క్రీస్తు పుట్టినరోజు. ప్రపంచవ్యాప్తంగా కిస్మస్ ను డిసెంబర్ 25న జరుపుకుంటారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో ప్రధానాకర్షణ క్రిస్మస్ చెట్టుదే. మరి క్రిస్మస్ చెట్టు ఎలా పుట్టింది..? దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం..
పచ్చని మొక్కలు..చెట్లతోనే మనిషి జీవితం ముడిపడి ఉంది. అటువంటి చెట్టుని మానవుల పూజించటం సంప్రదాయంగా మారింది. మనిషి జీవితానికి ప్రాణవాయువు చెట్ల నుంచి వస్తుంది. చెట్లు లేకుండా మనిషి మనుగడ కూడా ప్రశ్నార్థకమైపోతుంది.అందుకే చెట్లు మనిషి జీవితంలో భాగమైపోయాయి. దుష్ట శక్తులను నిరోధించే శక్తి చెట్లకు ఉందని కూడా మనుషులు నమ్ముతారు. చెట్లను పూజిస్తారు.
క్రిస్మస్ చెట్టు ఇంట్లో పెట్టుకో వడమనే జర్మన్‌ల నుంచి వచ్చిన సంప్రదాయమని తెలుస్తోంది. మధ్య యుగంలో డిసెంబర్ 24న జర్మన్‌లు ఈడెన్ తోటలో ఆడం, ఈవ్‌కి గుర్తుగా ఫర్ చెట్టుకి ఆపిల్ పండ్లని కట్టేవారు. ఆ చెట్టుని వారు పారడైస్ చెట్టుగా పిలుచుకునే వారు. ఆ తరువాత క్రమేపీ క్రిస్మస్ చెట్టు ఆచారం జర్మన్ నుంచి బ్రిటన్‌లోకి వచ్చింది. బ్రిటన్ లో ఆ చెట్టుకి రకరకాల కొవ్వొత్తులు, స్వీట్లు వంటివాటితో డెకరేట్ చేయం ప్రారంభించారు.
అలా ఈ సంప్రదాయం కెనడాలోకి కూడా వచ్చింది. ఆ తరువాత దాదాపు 100 సంవత్సరాలకు అమెరికాలోకి అడుగుపెట్టింది. ఇక సాధారణంగా ఇళ్లలో పెట్టుకునే క్రిస్మస్ చెట్లు ఇరవయ్యో శతాబ్దం వచ్చే సరికి బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేశాయి.
అమెరికాలో అనేక పబ్లిక్ ప్లేసుల్లో భారీ క్రిస్మస్ చెట్లను పెడుతుంటారు. ఇలా 1923 నుంచి అమెరికా శ్వేత భవనంలో క్రిస్మస్ చెట్టు అమర్చడం ప్రారంభమైంది. దీంతో ప్రతి ఏడాది ఆ చెట్టుకున్న దీపాలను వెలిగించడం ద్వారా అమెరికాలో క్రిస్టమస్ వేడుకలు ప్రారంభమవుతాయి.