Black Death : మానవాళికి ముంచుకొస్తున్న మరో ముప్పు

మానవాళికి మరో ముప్పు ముంచుకొస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ కారణంగా బుబోనిక్ ప్లేగు- బ్లాక్‌ డెత్‌ తిరిగి విజృంభించే అవకాశం ఉంది.

Black Death : మానవాళికి ముంచుకొస్తున్న మరో ముప్పు

Black Death

Updated On : October 14, 2021 / 7:51 AM IST

bubonic plague-black death : మానవాళికి మరో ముప్పు ముంచుకొస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, గ్లోబల్ వార్మింగ్ కారణంగా బుబోనిక్ ప్లేగు- బ్లాక్‌ డెత్‌ తిరిగి విజృంభించే అవకాశం ఉందని రష్యా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బ్లాక్ డెత్ వల్ల కలిగే ముప్పును గుర్తించి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్‌ ఇస్తున్నారు. రోజు రోజుకీ పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రజారోగ్యానికి ప్రమాదంగా మారిందని చెబుతున్నారు.

బ్లాక్ డెత్ 20 కోట్ల మంది ప్రాణాలను బలితీసుకుంది. 14వ శతాబ్దంలో ఈ వ్యాధి బారిన పడడంతో యూరప్ జనాభాలో 60శాతం తుడిచిపెట్టుకుపోయింది. ఇక రష్యా, యుఎస్, చైనాలలో ఇటీవల మళ్లీ ఈ వ్యాధి మూలాలు కనిపించాయి. దీంతో బ్లాక్‌ డెత్‌ను నియంత్రించడానికి, వాతావరణ సంక్షోభంపై కఠిన చర్యలు తీసుకోవాలని యునిసెఫ్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.

Golden Bride : ఈమె బంగారు పెళ్లికూతురు.. వంటిపై 60కేజీల పసిడి

బుబోనిక్ ప్లేగు బ్యాక్టీరియా నుంచి సంక్రమించే వ్యాధి. ఇది అడవి ఎలుకలపై వాలిన ఈగల నుంచి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన బాధితులు కేవలం 24 గంటలోనే మరణించే అవకాశం ఉంది. అయితే ఈ బుబోనిక్ ప్లేగు ఒకరి నుంచి మరొకరికి సోకడం చాలా అరుదు. జంతువుల నుంచి అందులోనూ ముఖ్యంగా ఈగల నుంచి మాత్రమే మానుషులకు సోకుతుంది. ప్లేగుతో బాధపడుతున్న వ్యక్తులు తీవ్ర జ్వరంలో బాధపడతారు. చలి, తలనొప్పి, శరీరం నొప్పులు, నరాల బలహీనత, వాంతులు, వికారం లాంటి లక్షలు కనిపిస్తాయి.