అబ్దుల్ కలాంకి కేసీఆర్, కేటీఆర్ నివాళి

  • Published By: veegamteam ,Published On : May 10, 2019 / 03:54 AM IST
అబ్దుల్ కలాంకి కేసీఆర్, కేటీఆర్ నివాళి

Updated On : May 10, 2019 / 3:54 AM IST

తమిళనాడులోని రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు సందర్శించారు. అనంతరం కలాంకు  నివాళులర్పించారు. 

అనంతరం కలాం మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మెమోరియల్ నిర్వాహకులు, సిబ్బంది కేసీఆర్‌కు స్వాగతం పలుకారు. కలాం ఉపయోగించిన వస్తువులతో ఏర్పాటుచేసిన మ్యూజియాన్ని కేసీఆర్ బృందం ఆసక్తిగా తిలకించారు. ఈ క్రమంలో మ్యూజియంకు చెందిన పలు విశేషాలను కేసీఆర్ కు సిబ్బంది వివరించారు. సీఎం కేసీఆర్,  కేటీఆర్ లతో పాటు  ఎంపీ సంతోష్‌కుమార్ తదితరులు ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు.