Kerala Boat Incident: కేరళ బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా..
మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.

CM Pinarayi Vijayan
Kerala Boat Incident: కేరళలోని మలప్పురం జిల్లాలో తానూర్ తీరంలో పర్యాటకుల బోటు బోల్తా పడిన విషయం విధితమే. ఆదివారం రాత్రి 7గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి చేరింది. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 40 మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ సంఖ్యపై స్పష్టత రాలేదు. ప్రమాద సమయంలో చాలా మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Kerala Boat Incident: కేరళ బోటు ప్రమాద ఘటనలో 22కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు
బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కేరళ సీఎం పినరయి విజయన్ కలిశారు. తిరురంగాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బోటు ప్రమాద బాధితులను సీఎం కలిసిశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు నిపుణులతో కూడిన జుడిషియల్ విచారణకు ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం ఓ విషాదం. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తామని చెప్పారు.
Army MIG-21 Crash: రాజస్థాన్‌లో ఇంటిపై కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. పైలట్ సేఫ్.. ముగ్గురు మృతి
ఇదిలాఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం విధితమే. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు 12 మంది ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కుటుంబాన్ని కూడా సీఎం విజయన్ పరామర్శించారు. వారి బాధ వర్ణణాతీమని, ఈ విషాద ఘటన తనను ఎంతో బాధించిందని సీఎం అన్నారు.