Kerala Boat Incident: కేరళ బోటు ప్రమాద ఘటనలో 22కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు

కేరళ బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి చేరింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Kerala Boat Incident: కేరళ బోటు ప్రమాద ఘటనలో 22కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు

Kerala Boat Incident

Kerala Boat Incident: కేరళలోని మలప్పురం జిల్లాలో తానూర్ తీరంలో పర్యాటకుల బోటు బోల్తా పడిన విషయం విధితమే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి చేరింది. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 40 మంది ఉన్నట్లు టికెట్లను బట్టి తెలుస్తోంది. అయితే, ఈ సంఖ్యపై స్పష్టత రాలేదు. బోటు బోల్తా పడటంతో ఎక్కువ మంది బురదలో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Kerala Boat Capsizes : కేరళలో ఘోర ప్రమాదం.. టూరిస్ట్ బోటు బోల్తా, 20మంది మృతి

సహాయక చర్యలు కొనసాగుతున్నాకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం అర్థరాత్రి వరకు 20 మృతదేహాలను వెలికితీయగా.. సోమవారం ఉదయం మరో  రెండు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 22కి చేరింది. ఈ విషయంపై ప్రాంతీయ అగ్నిమాపక రేంజ్ అధికారి షిజు కెకె ANIతో మాట్లాడుతూ.. ప్రమాదంకు సంబంధించి ఇప్పటి వరకు 22 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. అయితే, ప్రమాదం సమయంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేది స్పష్టత లేదు. ఎక్కువ మంది బాధితులు బురదలో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నాం. ఆ మేరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. చనిపోయిన వారిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. బోటు యాజమానికిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Gold Mine Fire: పెరూలోని బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 27 మంది కార్మికులు మృతి

ఆదివారం రాత్రి 7గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. బోల్తా పడిన బోటుని భారీ క్రేన్ల సాయంతో బయటకు తీశారు. అందులోంచి మృతదేహాలను వెలికితీశారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

 

 

కేరళ రెవెన్యూ మంత్రి కె. రాజన్ సోమవారం ఉదయం ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేయడానికి ఇండియన్ నేవీ చేతక్ హెలికాప్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఇదిలాఉంటే ప్రమాద ఘటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. సోమవారం ఉదయాన్నే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, కేరళ ముఖ్యమంత్రి విజయన్ సోమవారం సంఘటనా స్థలానికి చేరుకుంటారని ముఖ్యమంత్రికార్యాలయం తెలిపింది. ఒక ప్రకటన ప్రకారం.. సోమవారం అధికారిక సంతాప దినంగా ప్రభుత్వం ప్రకటించింది. బాధితులకు గౌరవ సూచకంగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా వేయబడ్డాయి.