గోరఖ్ నాథ్ ఆలయంలో యోగి జనతా దర్బార్

గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ ఆలయంలో సోమవారం(మార్చి-4,2019) యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జనతాదర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో సీఎంకు సమర్పించారు. ఈ సందర్భంగా జనతాదర్బార్ లో పాల్గొన్న రామా శంకర్ మిశ్రా అనే వ్యక్తి మాట్లాడుతూ.. బస్తీ జిల్లాకు చెందిన వ్యక్తితో తన కూతురికి విహం అయిందని,జూన్-30,2017న తమ కుమార్తెను అల్లుడు చంపేశాడని, హైకోర్టు అతడికి బెయిల్ ఇచ్చిందని, తన మిగతా కూతుర్లను కూడా చంపేస్తానని అతడు బెదిరిస్తున్నాడని, ఈ విషయంలో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని సీఎం తనకు హామీ ఇచ్చారని అన్నారు. రోడ్ల నిర్మానం, ఇతర సౌకర్యాలకు సంబంధించి తాను సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించానని, తాను ఈ విషయాన్ని పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చాడని తెలిపారు. యూపీ సీఎంగా భాధ్యతలు చేపట్టకముందు కూడా ప్రజలను నేరుగా కలిసేందుకు యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ దేవాలయంలో జనతాదర్బార్ లు నిర్వహించేవారు