యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి కన్నుమూత

  • Published By: venkaiahnaidu ,Published On : April 20, 2020 / 06:37 AM IST
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి కన్నుమూత

Updated On : April 20, 2020 / 6:37 AM IST

ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ ఇంట్లో విషాదం నెలకొంది. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ,లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆనంద్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో మార్చి-15,2020న ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. గ్యాస్ట్రాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ నేతృత్వంలో ఆయనకు ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ జరిగింది.

అయితే ఆదివారం ఆనంద్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంచింది. దీంతో ఆయనను ఆదివారం సాయంత్రం వెంటిలేటర్ పై ఉంచారు. వెంటిలేటర్ పై ఉన్న ఆనంద్ సింగ్ ఇవాళ(ఏప్రిల్-20,2020)ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఢిల్లీ ఎయిమ్స్ తెలిపింది. ఆదివారం యోగి ఆదిత్యనాధ్ తండ్రిని ఐసీయూ వార్డ్ కి తరలించే ముందు ఆయనకు డయాలసిస్ కూడా నిర్వహించినట్లు ఎయిమ్స్ తెలిపింది. 

తీవ్రమైన డైహైడ్రేషన్ తో బాధపడుతూ కొన్ని నెలల క్రితం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్..డెహ్రాడూన్ లోని ఓ హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం. ఆనంద్ సింగ్ ఫారెస్ట్ రేంజర్ గా గతంలో పనిచేశారు. ఆగస్టు-8,1948న జన్మంచిన ఆనంద్ సింగ్ బిస్త్ కు నలుగురు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ ఆనంద్ బిస్త్ కు రెండవ కుమారుడు. యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్ బిస్త్.

Also Read | చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్