Pak Attacks : ముష్కరమూకల వెనుక పాక్ హస్తం?..ఇండియన్ ఆర్మీకి కీలకమైన క్లూ!

రిటైర్డ్ పాక్ సైనికులే.. ఉగ్రవాదులను భారత్‌పైకి ఉసిగొల్పుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఉగ్రవాదుల ద్వారా తమ కసి తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Pak Attacks : ముష్కరమూకల వెనుక పాక్ హస్తం?..ఇండియన్ ఆర్మీకి కీలకమైన క్లూ!

Jammu

Updated On : October 27, 2021 / 12:21 PM IST

India and Pakistan : ఇండియన్ ఆర్మీని నేరుగా ఎదుర్కోలేని పాకిస్తాన్.. దొంగదారిలో కశ్మీర్‌లో అశాంతి చెలరేగేలా చేస్తోంది. కొన్నాళ్లుగా పేట్రేగిపోతున్న ముష్కరమూకల వెనుక.. పాక్ హస్తం ఉందనే సమాచారం మాత్రమే ఉండేది. కానీ.. తాజాగా అది నిజమని తేలింది. ఉగ్రవాదులు పక్కా స్కెచ్‌, మిలటరీ తరహా ట్రైనింగ్‌తో.. మన భద్రతా బలగాలే టార్గెట్‌గా దాడులు జరుపుతున్నాయి. 16 రోజులుగా.. తుపాకుల మోతతో లోయ మొత్తం దద్దరిల్లిపోతోంది. ఫూంచ్ సెక్టార్‌లో.. ఇండియన్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య నిత్యం పోరు నడుస్తోంది. అయితే.. శిక్షణ పొందిన టెర్రరిస్టులు, పాకిస్తాన్ మాజీ సైనికుల మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నట్లు ఇండియన్ ఆర్మీకి కీలకమైన క్లూ అందింది.

Read More : Huzurabad : హుజూరాబాద్‌‌లో ప్రలోభాల పర్వం..ఓటుకు రూ. 6 వేలు!

రిటైర్డ్ పాక్ సైనికులే.. ఉగ్రవాదులను భారత్‌పైకి ఉసిగొల్పుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆర్మీలో ఉన్నన్ని రోజులు.. భారత బలగాలను ఎదుర్కోలేకపోయిన పాక్ సైనికులు.. ఇప్పుడు ఉగ్రవాదుల ద్వారా తమ కసి తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టెర్రరిస్టుల భుజాలపై గన్ ఉంచి.. భారత్ మీదకు ఎక్కుపెడుతున్నారు. కశ్మీర్‌లో ఈ నెల 11న మొదలైన ఎన్‌కౌంటర్‌.. 15 రోజులుగా కంటిన్యూ అవుతూనే ఉంది. చివరిసారిగా.. డిసెంబర్ 2008 నుంచి జనవరి 2009 మధ్య 9 రోజులు మాత్రమే భతిదార్ ఆపరేషన్ నిర్వహించారు.

Read More : Anthrax : మాంసం తింటున్నారా..అయితే జాగ్రత్త, ఆంత్రాక్స్ కలవరం..నిపుణుల సూచనలు

ఆ సమయంలో.. ఉగ్రవాదులను ముట్టుబెట్టడంలో ఇండియన్ ఆర్మీ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు కూడా మన జవాన్లు అదే పనిలో ఉన్నారు. కానీ.. ఇప్పటికే 9 మంది అమరులయ్యారు. మరికొందరు గాయపడ్డారు. దీంతో.. మరింత నష్టం కలగకుండా ఉండేలా ఇండియన్ ఆర్మీ ప్లాన్ చేస్తోంది. కశ్మీర్ లోయలో.. దట్టమైన అడవి, కొండలతో ఆపరేషన్‌కు ఇబ్బంది కలుగుతోంది. దీంతో.. ఆ ప్రాంతమంతా టెర్రరిస్టులకు ఆవాసంగా మారింది. దీంతో.. వారిని గుర్తించేందుకు టెక్నాలజీని వాడుకుంటోంది ఆర్మీ. అయితే.. ఉగ్రవాదుల దగ్గర అత్యాధునిక ఆయుధాలున్నట్లు తెలుస్తోంది. వారికి.. పాకిస్తాన్ నుంచి వెపన్స్ అందుతున్నాయి. ఏదేమైనా.. కశ్మీర్ అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులను ఏరివేసి.. మరోసారి పాకిస్తాన్‌ కుట్రను ఛేదించాలని చూస్తున్నాయి భారత భద్రతా బలగాలు.