Huzurabad : హుజూరాబాద్‌లో ప్రలోభాల పర్వం..ఓటుకు రూ. 6 వేలు!
హుజూరాబాద్ బై పోల్ ప్రచారం సాయంత్రంతో ముగుస్తుంది. మరి తర్వాత ఏం జరగనుంది? 72 గంటల గ్యాప్‌లో ఓటర్ల మనసు మారిపోతే? ఓటరు దేవుడు కరుణించకపోతే ఏంటి పరిస్థితి?

Huzurabad Election
Huzurabad Election Campaign : హుజూరాబాద్ బై పోల్ ప్రచారం సాయంత్రంతో ముగుస్తుంది. మరి తర్వాత ఏం జరగనుంది? 72 గంటల గ్యాప్‌లో ఓటర్ల మనసు మారిపోతే? ఓటరు దేవుడు కరుణించకపోతే ఏంటి పరిస్థితి? ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లే వరకు ఏం చేయాలి? ప్రత్యక్షంగా వెళ్లి అడగలేరు. అభ్యర్థులను వెంటాడుతున్న ప్రశ్నలివీ. కానీ బ్యాక్ డోర్ రెడీగా ఉందంటున్నారు. నియోజకవర్గంలో పార్టీల ప్రచారం 2021, అక్టోబర్ 27వ తేదీ బుధవారంతో ముగుస్తుంది. పోలింగ్‌కు ఇంకా సమయం ఉంది. ఈ గ్యాప్‌లో తెరవెనుక మంత్రాంగానికి సిద్ధమయ్యాయి. ఓటర్ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా…హుజూరాబాద్ నియోజకవర్గంలో జోరుగా ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ఇంటికి తిరిగి నగదు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. నగదు పంపిణీతో ఓటర్లను ఆకట్టుకొనే యత్నం చేస్తున్నారు. ఒక్కో ఓటరుకు రూ. 6 వేలు పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read More : Air Hostess : ఎయిర్ హోస్టెస్‌ల అర్ధనగ్న నిరసనలు
ఏ ఎన్నిక జరిగినా…క్యాంపెయిన్ ముగిశాక…ఓట్లర్లను ప్రలోభ పెట్టే మంత్రం పార్టీల దగ్గర ఉంటుంది. ఆ మంత్రమే గెలుపునకు టర్నింగ్ పాయింట్. ఇప్పుడు దీన్ని హుజూరాబాద్‌లోనూ ప్రయోగించనున్నారు. ఇన్నాళ్లుగా అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలకు భిన్నంగా ప్రలోభాలపర్వం అధికంగా కనిపించే వీలుంది. నియోజకవర్గంలో ఓటుకు ఇంత మొత్తమనేలా డబ్బు పంపిణీకి రహస్యంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే భారీగా మద్యం పంపిణీకి జరుగుతోందని ప్రచారం. ఇక ఇంటింటికి మాంసం, చీరలు, ఇతర వస్తులు ఇలా అన్ని రకాలు చేరే అవకాశం ఉంది.
Read More : Anthrax : మాంసం తింటున్నారా..అయితే జాగ్రత్త, ఆంత్రాక్స్ కలవరం..నిపుణుల సూచనలు
పోలింగ్‌కు ముందు బుధ, గురువారం లోలోపల జరిగే ప్రచారం అభ్యర్థుల గెలుపు ఓటముల్ని ప్రభావితం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. హుజూరాబాద్‌లో ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి మూడు ప్రధాన పార్టీల తరఫున ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మాటల తూటాలు పేలాయి. పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి. హుజూరాబాద్ మే సవాల్ అంటూ రణరంగాన్ని తలపించాయి. అయితే ప్రత్యక్షంగా ప్రచారం ముగిసిన తర్వాత అసలు కథ అప్పుడే మొదలవుతుందంటున్నారు. ప్రలోభాలపర్వంపై పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.