Shivraj Singh Chouhan : మరణాలను చూసి కాంగ్రెస్ ఆనందం..ధృతరాష్ట్రునిలా వ్యవహరిస్తున్న సోనియా గాంధీ

కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ వ్య‌వ‌హార శైలిపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మౌనం దాల్చార‌ని, ఆమె ధృతరాష్ట్రుడిలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

Congress Is Celebrating Deaths Sonia Gandhi Watching Blindly Like Dhritarashtra Says Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ వ్య‌వ‌హార శైలిపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మౌనం దాల్చార‌ని, ఆమె ధృతరాష్ట్రుడిలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కమల్ నాథ్ చేసిన ఇండియన్ కరోనా వేరియంట్ ప్రకటనను సోనియా ఆమోదిస్తున్నారా? అని చౌహాన్ ప్రశ్నించారు. కమల్ నాథ్ వ్యాఖ్యలు ఆమోదిస్తే..కాంగ్రెస్ ఆలోచన విధానం ఇదే అని సోనియా గాంధీ దేశ ప్రజలకు చెప్పాలని చౌహాన్ అన్నారు.

కమల్ నాథ్ వ్యాఖ్యలు తప్పని భావిస్తే ఆయనపై చర్యలు తీసుకోకుండా ఎందుకు గుడ్డిగా ధృతరాష్ట్రుడిలా వ్యవహిస్తున్నారు అని సోనియాను చౌహాస్ ప్రశ్నించారు. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ తరహా పరిస్థితిలో ప్రభుత్వానికి,ప్రజలకు మద్దుతుగా ఉండటానికి బదులుగా కమల్ నాథ్ రాష్ట్రంలో అరాచకత్వాన్ని వ్యాప్తి చేస్తున్నారని చౌహాన్ విమర్శించారు. క‌రోనా మ‌హ‌మ్మారిపై ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న రేకెత్తించేలా వ్య‌వ‌హ‌రిస్తున్న క‌మ‌ల్ నాథ్ పై సోనియా గాంధీ చర్యలు తీసుకోవాల్సిందేనని చౌహాన్ అన్నారు.

వైరస్ క‌ట్ట‌డికి తాము చ‌ర్య‌లు చేప‌డుతుండ‌గా కాంగ్రెస్ పార్టీ అగ్గి రాజేస్తోంద‌ని చౌహాన్ ఆరోపించారు. క‌లిసిక‌ట్టుగా పోరాడాల్సిన స‌మ‌యంలో మ‌ర‌ణాల‌ను చూసి కాంగ్రెస్ ఆనందిస్తోంద‌ని విమ‌ర్శించారు. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ ఇండియ‌న్ వేరియంట్ అంటూ క‌మ‌ల్ నాథ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌ల ఫిర్యాదు ఆధారంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో క‌మ‌ల్ నాథ్ పై FIR న‌మోదైంది