GST On Cars : కార్లు కొందామనుకునే వారికి బ్రేకింగ్ న్యూస్.. ఈ కార్లపై 40 శాతం జీఎస్టీ.. లిస్ట్ చెక్ చేయండి..

GST Reforms : జీఎస్టీలో 12, 28శాతం స్లాబ్‌లు తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, లగ్జరీ కార్లపై 40శాతం జీఎస్టీ విధిస్తూ నిర్ణయించింది.

GST On Cars : కార్లు కొందామనుకునే వారికి బ్రేకింగ్ న్యూస్.. ఈ కార్లపై 40 శాతం జీఎస్టీ.. లిస్ట్ చెక్ చేయండి..

Luxury Cars

Updated On : September 4, 2025 / 11:48 AM IST

GST Reforms : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై జీఎస్టీలో రెండు స్లాబ్‌లు (5శాతం, 18శాతం) మాత్రమే కొనసాగించనున్నారు. జీఎస్టీలో 12, 28శాతం స్లాబ్ లు తొలగించాలని నిర్ణయించారు. అయితే, లగ్జరీ కార్లపై 40శాతం పన్ను విధిస్తూ నిర్ణయించారు.

Also Read: New GST Rates : జీఎస్టీలో మార్పులు.. సామాన్యులకు భారీ ఊరట.. సబ్బులు, షేవింగ్ క్రీమ్ నుంచి టీవీ, ఏసీల వరకు.. ధరలు తగ్గే వస్తువులివే..

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం భారతదేశ ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులను తీసుకురానుంది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే చిన్న కార్ల ధరలు తగ్గనున్నాయి. కానీ, లగ్జరీ వాహనాలు, హై-ఎండ్ ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెరగనున్నాయి. వీటిపై 40శాతం జీఎస్టీ అమల్లో ఉండనుంది. ప్రభుత్వ నిర్ణయంతో నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవున్న కార్లపై పన్నుభారం 10శాతం తగ్గనుంది.

కొత్త జీఎస్టీ శ్లాబ్ ప్రకారం.. 1500 సీసీలోపు ఉన్న డీజిల్, డీజిల్ హైబ్రిడ్ కార్లు, 1200 సీసీ లోపు పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, సీఎన్‌జీ, ఎల్‌పీ‌జీ కార్లకు సెస్సు కాకుండా 18శాతం ట్యాక్స్ పడనుంది. గతంలో ఈ వాహనాలు 28శాతం జీఎస్టీ పరిధిలో ఉండేవి. కేంద్రం తాజా నిర్ణయంతో.. టాటా ఆల్ట్రోజ్, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ ఐ10, ఐ120, రెనో క్విడ్ వంటి కార్ల ధరలు తగ్గనున్నాయి.

మధ్యశ్రేణి, భారీ ఎస్‌యూవీ వాహనాల శ్రేణిపై 40శాతం జీఎస్టీ విధించారు. ప్రస్తుతం వీటిపై 28శాతం జీఎస్టీ, 17నుంచి 22శాతం సెస్సు విధిస్తున్నారు. దీంతో పన్ను రేటు 45 నుంచి 50శాతం మధ్యలోకి వెళ్తుంది. తాజాగా శ్లాబుల్లో సవరణ తరువాత.. నేరుగా జీఎస్టీ 40శాతం మాత్రమే విధించడంతో 5 నుంచి 10శాతం వరకు పన్ను మిగలనుంది. పన్ను రేటు పెరిగినా.. సెస్సు రూపంలో వినియోగదారులకు మిగులు లభిస్తోంది. ఈ శ్రేణిలోకి టాటా హారియర్, మహీంద్రా, ఎక్స్‌యువీ 700, మారుతీ గ్రాండ్ విటారీ, హ్యుందాయ్ క్రెటా వంటి వాహనాలు వస్తాయి.

అదేవిధంగా.. 350 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్నమోటార్ సైకిళ్లు, స్కూటర్లపై 18శాతం జీఎస్టీ అమల్లోకి రానుంది. ఇది వరకు వీటిపై 28శాతం జీఎస్టీ ఉండేది. అయితే, 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్ లపై మాత్రం 40శాతం జీఎస్టీ విధించారు. దీంతో వీటి ధరలు పెరగనున్నాయి. రేసింగ్ కార్లు, వ్యక్తిగత పడవలు (యాట్స్), ప్రైవేట్ విమానాలపై కూడా 40శాతం జీఎస్టీ వర్తిస్తుంది.

పాన్‌ మసాలా, సిగరెట్‌, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అదేవిధంగా.. చక్కెర కలిపిన ఎరేటెడ్ పానీయాలు, కెఫిన్ కలిగిన పానీయాలు, ఆల్కహాల్ లేని పానీయాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 40శాతానికి పెంచారు.