GST Rates: పండుగ చేసుకోండి.. జీఎస్టీలో భారీ ధమాకా.. ధరలు బీభత్సంగా తగ్గిన వస్తువులివే..

పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు చేసింది.

GST Rates: పండుగ చేసుకోండి.. జీఎస్టీలో భారీ ధమాకా.. ధరలు బీభత్సంగా తగ్గిన వస్తువులివే..

New GST Rates

Updated On : September 4, 2025 / 10:20 AM IST

New GST Rates : పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం నాలుగు శ్లాబుల బదులు ఇకపై రెండే శ్లాబులు కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5శాతం కాగా.. రెండోది 18శాతం శ్లాబులు. స్థానికంగా తయారయ్యే వస్తువులకు డిమాండ్ ఏ మాత్రం తగ్గకుండా జీఎస్టీలో మార్పులు చేశారు.

Also Read: భూమిపై ఏలియన్ స్పేస్‌క్రాఫ్ట్ భీకర దాడి చేస్తుందా? సమయం ముంచుకొస్తుందా? అధ్యయనంలో సంచలన విషయాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు పది గంటలపాటు జీఎస్టీ పాలకమండలి 56వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 12శాతం, 28శాతం పన్ను శ్లాబులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గుట్కా, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, సిగరేట్లు, మద్యం వంటి వాటిపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు చేశారు. ఈ నెల 22వ తేదీ నుంచే కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.

 

జీఎస్టీలో మార్పులు ఇలా..
♦ 18శాతం నుంచి 5శాతం శ్లాబులోకి వచ్చిన వస్తువులు ఇవే..
హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్‌పేస్ట్, సబ్బులు, టూత్ బ్రష్‌లు, షేవింగ్ క్రీమ్.
♦ 18శాతం, 12శాతం నుండి 5శాతం శ్లాబులోకి వచ్చిన వస్తువులు ఇవే..
వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, ప్రీ-ప్యాకేజ్డ్ నమ్‌కీన్, భుజియా, మిక్చర్, వంట సామాగ్రి, పాల సీసాలు, న్యాప్‌కిన్లు, డైపర్లు, కుట్టుమిషన్లు. అంజీర, ఖర్జూరం, అవకాడో, సిట్రస్ పండ్లు, మాంసం, ఫ్రూట్ జెల్లీలు, లేత కొబ్బరి నీళ్లు, 20లీటర్ల సీసాలో ప్యాక్ చేసిన తాగునీరు, పండ్ల గుజ్జు లేదా పండ్ల రసం, ఐస్ క్రీమ్, బిస్కెట్లు, కార్న్ ప్లేక్స్, తృణధాన్యాలు, చక్కెర మిఠాయి తదితర వస్తువులు.
♦ ఆరోగ్య రంగంలో 18శాతం నుండి 0 శ్లాబులోకి వచ్చినవి ఇవే ..
వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలు,
♦ 12 నుంచి 5శాతం శ్లాబులోకి వచ్చినవి.. థర్మా మీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్‌లు, గ్లూకోమీటర్, కళ్లజోళ్లు.
♦ విద్యా రంగంలో 12శాతం నుండి సున్నా శ్లాబులోకి వచ్చిన వస్తువులు ఇవే..
మ్యాప్ లు, చార్టులు, గ్లోబ్‌లు, పెన్షిళ్లు, షార్ప్‌నర్‌లు, క్రేయాన్స్, ప్యాస్టెల్స్, ఎక్సర్‌సైజ్ పుస్తకాలు, నోట్ బుక్స్, రబ్బరు.
♦ 5శాతం శ్లాబులోకి వచ్చిన వ్యవసాయ పరికరాలు ఇవే..
ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, ట్రాక్టర్లు, స్పెసిఫైడ్ బయో ఫెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, స్ప్రింక్లర్లు, కోత, నూర్పిడికి సంబంధించి వ్యవసాయ పరికరాలు, వ్యవసాయ, ఉద్యనవన, అటవీ యంత్రాలు.
♦ 28శాతం నుంచి 18శాతం శ్లాబులోకి వచ్చిన విద్యుత్ గృహోపకరణాలు ఇవే..
ఏసీలు, టీవీలు (32 అంగుళాల పైబడినవి), ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీలతో సహా, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మెషీన్లు.
♦ వాహన రంగంలో 28శాతం నుంచి 18శాతం శ్లాబులోకి వచ్చే వస్తువుల..
పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, ఎల్‌పీజీ, సీఎన్‌జీ కార్లు (1200 సీసీ లోపు), డీజిల్, డీజిల్ హైబ్రిడ్ కార్లు (1500 సీసీ లోపు), మూడు చక్రాల వాహనాలు, 350 సీసీ వరకు మోటార్ సైకిళ్లు, రవాణా కోసం వాడే మోటారు వాహనాలు.
♦ సిమెంట్ పై జీఎస్టీ 28శాతం నుంచి 18శాతానికి పరిమితం చేశారు.
♦ హస్త కళా ఉత్పత్తులు, పాలరాయి, గ్రానైట్ దిమ్మెలపై జీఎస్టీ 5శాతంకు తగ్గించారు.
♦ విద్యుత్ వాహనాలపై 5శాతం జీఎస్టీ కొనసాగుతుంది.
♦ ఖరీదైన కార్లు, రేస్ క్లబ్బులు, లీజింగ్-రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందేలు, లాటరీ, ఆన్‌లైన్ మనీ గేమింగ్ పై 40శాతం పన్ను పడుతుంది.
♦ స్లాబుల మార్పు వల్ల రూ.48వేల కోట్ల మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని అధికారులు తెలిపారు.

♦ టూత్ పౌడర్, ఫీడింగ్ బాటిళ్లు, టేబుల్‌వేర్, కిచెన్‌వేర్, గొడుగులు, పాత్రలు, సైకిళ్లు, వెదురు ఫర్నిచర్ మరియు దువ్వెనలు వంటి వినియోగ వస్తువులపై రేటు 12 శాతం నుండి 5 శాతానికి తగ్గనుంది.
♦ షాంపూ, టాల్కమ్ పౌడర్, టూత్‌పేస్ట్, టూత్ బ్రష్‌లు, ఫేస్ పౌడర్, సబ్బు మరియు హెయిర్ ఆయిల్‌పై కూడా అదే రేటును 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించారు.