సంపన్న లోక్‌స‌భ‌ అభ్యర్థి ఎవరో తెలుసా.. ఆయన ఆస్తులు ఎంతంటే?

అత్యంత సంపన్న అభ్యర్థులైన మొదటి 10 మందిలో బీజేపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, ఏఐఏడీఎంకే నుంచి ఇద్దరు, బీఎస్పీ నుంచి ఒకరు ఉన్నారు. 

సంపన్న లోక్‌స‌భ‌ అభ్యర్థి ఎవరో తెలుసా.. ఆయన ఆస్తులు ఎంతంటే?

Congress MP Nakul Nath: లోక్‌స‌భ‌ తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. మొదటి దశలో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఫస్ట్ పేస్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. మొదటి పది మంది సంపన్న అభ్యర్థుల పేర్లను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడైన నకుల్ నాథ్‌కు రూ.717 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఏడీఆర్ తెలిపింది. చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీలో ఉన్నారు.

తమిళనాడులోని ఈరోడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏఐఏడీఎంకే అభ్యర్థి అశోక్ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. రూ.662 కోట్ల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో ఆయన ప్రకటించారు. రూ. 304 కోట్ల ఆస్తులు కలిగిన శివగంగ బీజేపీ అభ్యర్థి దేవనాథన్ యాదవ్ మూడో సంపన్న అభ్యర్థిగా నిలిచారు. మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేసే ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి విలువ రూ. 4.51 కోట్లు అని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. అత్యంత సంపన్న అభ్యర్థులైన మొదటి 10 మందిలో బీజేపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, ఏఐఏడీఎంకే నుంచి ఇద్దరు, బీఎస్పీ నుంచి ఒకరు ఉన్నారు.

Also Read: అందుకే.. వాలంటీర్ల జీతం 10వేలకు పెంచుతామని చంద్రబాబు అంటున్నారు- పేర్నినాని