కాంగ్రెస్ దృష్టిలో OROP అంటే ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక : అమిత్ షా

సైనికుల సంక్షేమాన్ని కాంగ్రెస్ పట్టించేకోలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు విమర్శించారు. కాంగ్రెస్ దృష్టిలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్(OROP) అంటే ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక అని అర్థమని షా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(జనవరి 29,2019) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హరిర్పూర్ లో నిర్వహించిన బీజేపీ పన్నా ప్రముఖ్ సమ్మేళన్ లో పాల్గొన్న అమిత్ షా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు.
70 ఏళ్లుగా ప్రభుత్వాలు సైనికులను నిర్లక్ష్యం చేశాయని, మోడీ ప్రధాని అయ్యాకనే మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ నిజాయితీగా అమలు అయిందని తెలిపారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పేదల గురించి పట్టించుకోలేదని, బీజేపీ తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలు, పథకాల ద్వారానే దేశంలో పేదరికం తగ్గుతోందని అమిత్ షా విమర్శించారు.
అయితే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ పై అమిత్ షా చేసిన విమర్శలపై స్పందించిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా..దేశం ప్రస్తుతం ఓడొమోస్(ఓవర్ డోస్ ఆఫ్ ఓన్లీ మోడీ ఓన్లీ షా)తో ఇబ్బందులు పడుతోందని వ్యంగ్యంగా అన్నారు.