కర్నాటక నుంచే : ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ

  • Published By: veegamteam ,Published On : January 1, 2019 / 06:28 AM IST
కర్నాటక నుంచే : ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ

Updated On : January 1, 2019 / 6:28 AM IST

ప్రకాష్ రాజ్.. కొన్నాళ్లుగా రాజకీయాల్లో తన గళం గట్టిగా వినిపిస్తున్న సినీ స్టార్. కర్నాటక రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆయన.. హైదరాబాద్ శివార్లలో ఫాంహౌస్ కొనుక్కుని వ్యవసాయం చేస్తున్నారు. సామాజిక కార్యకర్త గౌరీలంకేష్ హత్యకు నిరసనగా ఆందోళనలు నిర్వహించారు. ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలను ఏకిపారేస్తూ వణుకుపుట్టిస్తున్నారు. ఇప్పటివరకు మాటల వరకే ఉన్న ఆయన.. ఇప్పుడు చేతల్లో చూపించటానికి రెడీ అయ్యారు. ఎన్నికల బరిలో నిలబడి.. మార్పుకు అడుగు వేస్తున్నారు.
లోక్‌సభకు పోటీ :
రాబోతున్న జనరల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు ప్రకాష్ రాజ్. స్వతంత్ర్య అభ్యర్థిగా లోక్‌సభ బరిలో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఏ పార్టీ మద్దతు తీసుకోను అని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రం.. ఏ నియోజకవర్గం అనేది ఇంకా తెలపలేదు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ ప్రముఖలుతో మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకు. ఈక్రమంలోనే ఆయన పోటీ రెండు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతోంది.
తెలంగాణ నుంచి డౌటే:
తెలంగాణలో మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చారు. సో ఆయన తెలంగాణ నుంచి పోటీ చేయకపోవచ్చు అనే చర్చ ఉంది. సొంత రాష్ట్రం అయిన కర్నాటక నుంచే బరిలోకి దిగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే గౌరీ లంకేష్ హత్య, ఆ తర్వాత రాజకీయ పరిణామాలపై గట్టిగా నిలదీసింది.. ప్రశ్నించింది ఆయనే. సో.. కర్నాటక నుంచి ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్ నిలబడనున్నట్లు చెబుతున్నారు ఆయన సన్నిహితులు.