కక్ష సాధింపు : బదిలీ చేశారని.. SI వినూత్న నిరసన

  • Published By: madhu ,Published On : November 16, 2019 / 02:36 PM IST
కక్ష సాధింపు : బదిలీ చేశారని.. SI వినూత్న నిరసన

Updated On : November 16, 2019 / 2:36 PM IST

కక్ష సాధింపులో భాగంగా తనను బదిలీ చేశారని భావించిన ఓ ఎస్ఐ వినూత్నంగా నిరసన తెలిపాలని అనుకున్నాడు. ఏకంగా 65 కిలోమీటర్లు పరుగు తీశాడు. కానీ..అంతదూరం పరుగెట్టలేక మధ్యలోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇటావాలో విజయ్ ప్రతాప్ సబ్ ఇన్స్ పెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇతడిని పై అధికారి బదిలీ చేశారు. పోలీస్‌ లైన్‌ పీఎస్ నుంచి బిథోలీ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇది ఇష్టంలేని విజయ్‌.. నిరసనగా పరుగు తీయడం ప్రారంభించాడు. తనను బదిలీ చేసిన పోలీస్‌ స్టేషన్‌ వరకు అంటే దాదాపు 65 కిలోమీటర్ల వరకు పరిగెడుతూనే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పరిగెత్తి పరుగెత్తి ఒకచోట రోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోయాడు. 

దీంతో అతడిని స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.  పోలీస్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ నిరంకుశ, కక్షసాధింపు విధానాలకు నిరసనగానే తాను పరుగుతీశానని విజయ్‌ ప్రతాప్‌ తలిపారు. పరుగు ద్వారా విజయ్‌ ప్రతాప్‌ చేసిన నిరసన ఉన్నతాధికారులకు చేరింది. విచారణ కొనసాగుతోంది. 
Read More : స్వామి శరణం : తెరుచుకున్న అయ్యప్ప ద్వారాలు