లాఠీ లాక్కొని పోలీస్‌నే చితకబాదిన వ్యక్తి

పోలీస్ కానిస్టేబుల్ లాఠీ లాక్కొని అతణ్నే చితకబాదాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఘటన బెంగళూరు-మైసూర్ రోడ్ పై జరిగింది. రాత్రి 10.. 10న్నర సమయంలో కొలూరు చెక్ పోస్ట్ వద్దకు ఓ వాహనం వచ్చి ఆగింది. పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్(25) అతని వద్దకు వెళ్లి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ జరుగుతుందని వాహనం చెక్ చేయబోయాడు.
ఇందులో భాగంగానే SUV డ్రైవర్ ను అతని పాస్ చూపించమని అడిగాడు. అంతే ప్రవీణ్ చేతిలో ఉన్న లాఠీని లాక్కొని నీ ఐడీ కార్డు చూపించు అని పోలీసును ఎదురుప్రశ్నించాడు. తాను ఫుడ్ కమిషనర్ ని అని చెప్పడంతో అక్కడొక చిన్నపాటి వాదన జరిగింది.
‘ప్రవీణ్ తో పాటు మరో ముగ్గురు సభ్యులు ఎస్ యూవీ చెక్ చేయడం మొదలుపెట్టారు. ఇది ప్రభుత్వ వాహనం అని చెప్పినప్పటికీ తనిఖీలు చేశారు. మీ ఐడి కార్డు చూపిస్తేనే సహకరిస్తానని చెప్పి బూతులు తిట్టడం మొదలుపెట్టాడని పోలీస్ ఆఫీసర్ అంటున్నారు.
తాను రోజూ ఇదే రూట్లో వెళతానని బాధితుడిపై అరవడం మొదలుపెట్టాడు. తర్వాత కానిస్టేబుల్ ఐడీ కార్డు చూపెట్టమన్నాడు. వినకుండా చెకింగ్ లు చేస్తున్నాడని బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. కానిస్టేబుల్ ను అదే లాఠీతో కొట్టాడు. వాదన తర్వాత SUVమైసూర్ వైపుగా వెళ్లింది. ఆ కార్ డ్రైవర్ తాను వెళ్లి పై అధికారులతో మాట్లాడి నీ సంగతి తేలుస్తానని బెదిరించినట్లు సమాచారం. అసలు ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కాదని అతను వెళ్లిన కారు గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు. (Tablighi Jamaat సభ్యుడు సూసైడ్)
అతనిపై డ్యూటీలో ఉన్న పబ్లిక్ సర్వెంట్ దాడి చేసినందుకు క్రిమినల్ కేసు ఐపీసీ 353తో పాటు, ఉద్దేశ్యపూర్వకంగా అవమానించినందుకు ఐపీసీ 504కింద, ఐపీసీ 506కింద పలు కేసులు నమోదు చేశారు.