Bihar : ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించిన ఆడ కుక్క అరెస్ట్
ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో బీహార్‌లో ఒక కుక్కను పోలీసులు అరెస్ట్ చేశారు.

Biahar Dog Detaind
Bihar : ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో బీహార్‌లో ఒక కుక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ లోని బక్సర్ జిల్లాలో ఈ నెల 6వ తేదీన పోలీసులు రోడ్డుపై వెళ్తున్న వాహానాలను తనిఖీ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని ఘాజీపూర్ నుంచి వస్తున్న ఒక కారును ఆపి సోదాలు చేయగా ఆ కారులో ఆరు విదేశీ మద్యం సీసాలు లభించాయి.
అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా ఇద్దరూ మద్యం సేవించినట్లు తేలింది. బీహార్ లో మద్యాన్ని నిషేధించిన నేపధ్యంలో సబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి వారిద్దరినీ అరెస్ట్ చేశారు. వారు ప్రయాణిస్తున్న కారును, కారులోని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు కారులో ఉన్న జర్మన్ షెప్పర్డ్ డాగ్ ను కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.
ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించిందనే కారణంతో కుక్కను ముసాఫిల్ పోలీసు స్టేషన్ లో ఉంచారు. కుక్కపై చట్టంలోని సెక్షన్ (56)2 కింద కేసు నమోదు చేసి జప్తు చేశారు. ఆ కుక్కకు రోజు డాగ్ ఫుడ్ పెడుతున్నారు. అయితే ఆ కుక్క కేవలం ఇంగ్లీష్ మాటలను మాత్రమే అర్ధం చేసుకుంటోందని పోలీసు అధికారి చెప్పారు. అందుకోసం దానికి ఇంగ్లీషులో సంకేతాలు ఇచ్చేందుకు ఇంగ్లీషు తెలిసిన వ్యక్తి సహాయం తీసుకుంటున్నట్లు చెప్పారు.
జాతికుక్కను స్టేషన్ లో ఉంచటం ఖరీదైన వ్యవహారం అని పోలీసులు అంటున్నారు. చట్టంలోని సెక్షన్ 56 ప్రకారం మద్యం రవాణా చేసే ఏదైనా జప్తు చేయబడుతుంది. అలాగే సెక్షన్ 57 ప్రకారం దొరికిన మత్తు పదార్దాలు కూడా జప్తు చేయబడతాయి.
Also Read : Go First Air Lines : గో ఫస్ట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు-అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన పైలట్లు