Corona Cases : ఒక్కరోజులోనే కేర‌ళ‌లో 32,803 క‌రోనా కేసులు..దేశంలో 47,092 కేసులు

కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోష పడినన్ని రోజులు పట్టలేదు. మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళలో ఒక్కరోజులోనే 32,803 కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది.

Corona Cases : ఒక్కరోజులోనే కేర‌ళ‌లో 32,803 క‌రోనా కేసులు..దేశంలో 47,092 కేసులు

Corona In Kerala

Updated On : September 2, 2021 / 11:15 AM IST

corona in inida : కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోష పడినన్ని రోజులు పట్టలేదు. మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపించటానికి సిద్దంగా ఉన్నట్లుగా అనుమానాలు తలెత్తుతున్నాయి మరోసారి పెరుగుతున్న కేసుల సంఖ్య చూస్తుంటే.మరోపక్క థర్డ్ వేవ్ వచ్చేసినట్లుగా సమాచారం.

ఈ క్రమంలో దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దీంట్లో బాగంగానే దేశవ్యాప్తంగా కొత్తగా 47,092 కేసులు నమోదయ్యాయి. అలాగే కేరళలో ఒక్కరోజులోనే 32,803 క‌రోనా కేసులు నమోదు కావటం అక్కడి పరిస్థితిని నిదర్శనంగా కనిపిస్తోంది. అసలు దేశంలో కరోనా కేసు నమోదు అయిన కేరళలలో మరోసారి కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఈక్రమంలో దేశంలో నిన్న కొత్తగా 47,092 క‌రోనా కేసులు న‌మోద‌యినట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,28,57,937కి చేరింది. అలాగే..35,181 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 509 మంది మృతి చెందారు.

దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,39,529కి పెరిగింది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,20,28,825 మంది కోలుకున్నారు. 3,89,583 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. అలాగే, నిన్న 81,09,244 డోసుల వ్యాక్సిన్ల వేశారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 66,30,37,334 కోట్ల‌ డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మరోపక్క, నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 32,803 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో 173 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిచటంతో ఇక కరోనాతో సహజీవనం తప్పదా అనే సందేహాలు వస్తున్నాయి.